న్యూఢిల్లీ: ఇండియా టెన్నిస్ ప్లేయర్ యూకీ భాంబ్రీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో తన కెరీర్‌లోనే అత్యుత్తమంగా వరల్డ్ 20వ ర్యాంక్ అందుకున్నాడు. దాంతో లెజెండరీ ప్లేయర్ రోహన్ బోపన్న తర్వాత ఏటీపీ డబుల్స్ టాప్–-20 ర్యాంక్ సాధించిన తొలి ఇండియన్‌గా యూకీ నిలిచాడు.
ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మూడో రౌండ్ వరకు చేరుకోవడం ద్వారా లభించిన పాయింట్లు అతడిని ఈ అరుదైన మైలురాయికి చేర్చాయి. 33 ఏండ్ల యూకీ భాంబ్రీ, గత ఏడాది కాలంగా అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు. గతేడాది తన తొలి ఏటీపీ 500 టైటిల్‌ను గెలుచుకోవడంతో పాటు యూఎస్ ఓపెన్ సెమీఫైనల్స్ వరకు వెళ్లాడు.
