జెనీవా ఓపెన్‌‌‌‌‌‌‌‌ టెన్నిస్ టోర్నీ ఫైనల్లో యూకీ జోడీ

జెనీవా ఓపెన్‌‌‌‌‌‌‌‌ టెన్నిస్ టోర్నీ ఫైనల్లో యూకీ జోడీ

జెనీవా: జెనీవా ఓపెన్‌‌‌‌‌‌‌‌ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీ మెన్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌ విభాగంలో యూకీ బాంబ్రీ–మైకేల్‌‌‌‌‌‌‌‌ వీనస్‌‌‌‌‌‌‌‌ (న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌) జోడీ ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన సెమీస్‌‌‌‌‌‌‌‌లో యూకీ–వీనస్‌‌‌‌‌‌‌‌ 7–5, 6–3తో పెట్రా రిక్లీ–ఆడమ్‌‌‌‌‌‌‌‌ పవ్లాసెక్‌‌‌‌‌‌‌‌ (చెక్‌‌‌‌‌‌‌‌)పై గెలిచారు. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో ఇండో–కివీస్‌‌‌‌‌‌‌‌ ద్వయానికి ఇదే తొలి ఫైనల్‌‌‌‌‌‌‌‌ కావడం విశేషం. గంటా 12 నిమిషాల మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో యూకీ–వీనస్‌‌‌‌‌‌‌‌ కీలక టైమ్‌‌‌‌‌‌‌‌లో పాయింట్లు రాబట్టడంతో పాటు ప్రత్యర్థులపై ఒత్తిడి తగ్గకుండా చూశారు. ఫైనల్లో యూకీ ద్వయం రొమైన్‌‌‌‌‌‌‌‌ ఆర్నెడో–మార్క్‌‌‌‌‌‌‌‌ పోల్మన్స్‌‌‌‌‌‌‌‌తో తలపడతారు. సెమీస్‌‌‌‌‌‌‌‌లో ఆర్నెడో–పోల్మన్స్‌‌‌‌‌‌‌‌ 7–6 (4), 6–2తో కాన్‌‌‌‌‌‌‌‌స్టాంటిన్‌‌‌‌‌‌‌‌ ఫ్రాంట్‌‌‌‌‌‌‌‌జెన్‌‌‌‌‌‌‌‌–రాబిన్‌‌‌‌‌‌‌‌ హాస్‌‌‌‌‌‌‌‌పై గెలిచారు.