IND vs PAK: యువరాజ్ vs అఫ్రిది.. జూన్ 6న ఇండియా- పాక్ మ్యాచ్

IND vs PAK: యువరాజ్ vs అఫ్రిది.. జూన్ 6న ఇండియా- పాక్ మ్యాచ్

భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య  మ్యాచ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాయాదుల మధ్య సమరమ అంటే అభిమానులకు ఎక్కడ లేని పూనకాలు వస్తాయి. ఏ దేశంపై ఓడినా తట్టుకుంటారేమో.. పాక్ తో మ్యాచ్ గెలవకపోతే అసలు జీర్ణించుకోలేరు. టీ20 వరల్డ్ కప్ లో జూన్ 9న న్యూయార్క్ వేదికగా భారత్, పాక్ అంతర్జాతీయ మ్యాచ్ లో తలపడుతుండగా.. జూలైలో ఇరు జట్ల మధ్య దిగ్గజాలు మ్యాచ్ ఆడేందుకు రంగం సిద్ధమైంది. 
            
జూలై 3 (బుధవారం) నుండి జూలై (శనివారం) 13 వరకు లెజెండ్స్ లీగ్ జరగనుంది. తొలిసారి నిర్వహిస్తున్న ఈ పోటీలో మొత్తం 6 దేశాలు ఈ టోర్నీలో ఆడతాయి. ఇంగ్లండ్, ఇండియా, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, దక్షిణాఫ్రికాకు చెందిన లెజెండ్స్ జట్లు 10 రోజుల పాటు జరిగే ఈ మెగా లీగ్ లో టైటిల్ కోసం పోటీపడనున్నాయి. అందరూ ఎదురు చూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జూలై 6న జరగనుంది. ఎడ్జ్ బాస్టన్ ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది.    

భారత జట్టుకు యువరాజ్ కెప్టెన్సీ చేస్తుండగా.. పాకిస్థాన్ జట్టును షాహిద్ ఆఫ్రిది లీడ్ చేయనున్నాడు. టీ20ల్లో ఘనమైన రికార్డ్ ఉన్న యువీపైనే అందరి కళ్లున్నాయి. అన్ని జట్ల త్వరలో ప్రకటించనున్నారు. మ్యాచ్ లు ప్రతి రోజు మధ్యాహ్నం 1 గంటకు ఒక మ్యాచ్.. సాయంత్రం 5 గంటలకు మరో మ్యాచ్ జరుగుతుంది. క్రిస్ గేల్, బ్రెట్ లీ, జాక్ కల్లిస్,కెవిన్ పీటర్సన్ లాంటి దిగ్గజాలు ఈ టోర్నీలో ఆడనున్నారు.