సీఈసీకి జడ్ కేటగిరీ సెక్యూరిటీ

సీఈసీకి జడ్ కేటగిరీ సెక్యూరిటీ
  • ముప్పు పొంచి ఉన్నందున భద్రత పెంచిన కేంద్రం
  • 24 గంటలపాటు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కాపలా

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి(సీఈసీ) రాజీవ్ కుమార్​కు కేంద్రం జడ్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించిం ది. ఎన్నికల నేపథ్యంలో ఆయనకు ముప్పు పొంచి ఉందన్న ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా కేంద్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. జడ్ కేటగిరీ సెక్యూరిటీలో భాగంగా రాజీవ్​కు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది 24 గంటలపాటు సెక్యూరిటీ కల్పించనున్నారు. 

దాదాపుగా 40 మంది కమాండోలను ఆయనకు భద్రత కల్పిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. రాజీవ్ కుమార్ 1984 బ్యాచ్​కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్. 2022 మే నెలలో ఆయన సీఈసీ గా బాధ్యతలు తీసుకున్నారు. అయితే, సీఈసీకి ఇలా జడ్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించడం గతంలో అరుదైన సందర్భాల్లో మాత్రమే జరిగింది. టీఎన్ శేషన్ సీఈసీగా ఉన్నప్పుడు వీఐపీ భద్రత ఉండేది.