
సత్యదేవ్, కన్నడ నటుడు డాలీ ధనంజయ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘జీబ్రా’. ఈశ్వర్ కార్తీక్ దర్శకుడు. ప్రియా భవాని శంకర్, జెన్నిఫర్ పిచినాటో హీరోయిన్స్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసిన మేకర్స్, తాజాగా డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయని ప్రకటించారు.
నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఆర్థిక నేరాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎస్.ఎన్ రెడ్డి, బాల సుందరం, దినేష్ సుందరం కలిసి నిర్మిస్తున్నారు. ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. సత్యరాజ్, సునీల్, గరుడ రామచంద్రరాజు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో పాన్ ఇండియా వైడ్‌గా విడుదల కానుంది.