Layoffs : జీ టెక్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ లో ఉద్యోగుల తొలగింపు

Layoffs : జీ టెక్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ లో ఉద్యోగుల తొలగింపు

జీ ఎంటర్ టైన్ మెంట్ సంచలన నిర్ణయం తీసుకున్నది. ఉద్యోగుల తీసివేతకు నిర్ణయం తీసుకున్నది. బెంగళూరులోని జీ టెక్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ లో సగం మంది ఉద్యోగులను ఇంటికి పంపించాలని నిర్ణయం తీసుకున్నది. ఈ సంఖ్య ఎంత అనేది మాత్రం వెల్లడించలేదు. సోనీతో జీ విలీనం ప్రక్రియ ఆగిపోయిన తర్వాత.. జీ కంపెనీ నష్టాలను తగ్గించుకోవటం కోసం.. జియో, డిస్నీ ఒప్పందం తర్వాత మార్కెట్ నుంచి వస్తున్న పోటీని ఎదుర్కొనేందుకు.. జీ కంపెనీ నష్టాలను తగ్గించుకోవటానికి.. ఉద్యోగుల సంఖ్యను తగ్గించనున్నట్లు ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పునిత్ గోయెంకా వెల్లడించారు.

బెంగళూరులో జీ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ఉంది. ఇక్కడి నుంచే జీ సంస్థలకు అవసరం అయినా టెక్ సపోర్ట్, డెవలప్ మెంట్ జరుగుతుంది. టీవీ మీడియాకు సైతం ఈ సెంటర్ నుంచే సపోర్ట్ ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో జీ నష్టాలను గణనీయంగా తగ్గించే వ్యూహంలో భాగంగా.. జీ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ లో సగం మంది ఉద్యోగులపై వేటు వేయాలని నిర్ణయించింది. పనితీరు ఆధారంగా తొలగింపు ఉంటుందని స్పష్టం చేసింది కంపెనీ. అదే విధంగా హిందీ, ఇంగ్లీష్ తోపాటు ఇతర భాషల్లోని ఎంటర్ టైన్ మెంట్, న్యూస్ ఛానెల్స్ లో ప్రక్షాళన జరుగుతుందని స్పష్టం చేసింది కంపెనీ. 

ఎంత మంది ఉద్యోగులకు తీసి వేస్తున్నట్లు.. ఆ సంఖ్య ఎంత అనేది మాత్రం వెల్లడించలేదు జీ కంపెనీ.