యునైట్ 8 స్పోర్ట్స్..  క్రీడా చానళ్లను ప్రారంభించిన జీ

యునైట్ 8 స్పోర్ట్స్..  క్రీడా చానళ్లను ప్రారంభించిన జీ

ఢిల్లీ: ప్రముఖ బ్రాడ్‌‌‌‌‌‌‌‌కాస్టర్ జీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అనుమతితో 'యునైట్8 స్పోర్ట్స్' బ్రాండ్ కింద 4 కొత్త క్రీడా చానళ్లను మంగళవారం ప్రారంభించింది. 2026 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌తో సహా అన్ని ఫిఫా మ్యాచ్‌‌‌‌‌‌‌‌లను భారత మార్కెట్‏లో ప్రసారం చేయడానికి 8 ఏండ్ల ఒప్పందం కుదుర్చుకున్న మరుసటి రోజే జీ ఈ నిర్ణయం తీసుకుంది. 

యునైట్8 స్పోర్ట్స్ 1, స్పోర్ట్స్ 2తో పాటు వాటి హెచ్‌‌‌‌‌‌‌‌డీ చానళ్లు దేశవ్యాప్తంగా 500కి పైగా కేబుల్, డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారమ్‌‌‌‌‌‌‌‌లలో అందుబాటులోకి వచ్చాయి. ఈ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్ ద్వారా ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్, క్రికెట్, కబడ్డీ, బ్యాడ్మింటన్, బాక్సింగ్ వంటి విభిన్న క్రీడలను ప్రసారం చేయనున్నారు. దేశవ్యాప్త క్రీడాభిమానులకు అత్యుత్తమ వీక్షణ అనుభూతిని అందిస్తామని సంస్థ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ బావేశ్ జనావ్లేకర్ తెలిపారు.