రెండో టెస్ట్‌లో తడబడుతోన్న జింబాబ్వే.. ఫస్ట్ ఇన్సింగ్స్‎లో 125కే ఆలౌట్‌

 రెండో టెస్ట్‌లో తడబడుతోన్న జింబాబ్వే.. ఫస్ట్ ఇన్సింగ్స్‎లో 125కే ఆలౌట్‌

బులవాయో: న్యూజిలాండ్‌తో శుక్రవారం మొదలైన రెండో టెస్ట్‌లో జింబాబ్వే తడబడింది. మ్యాట్‌ హెన్రీ (5/40), జకారీ ఫౌల్క్స్ (4/38) బంతితో చెలరేగడంతో.. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 48.5 ఓవర్లలో 125 రన్స్‌కే ఆలౌటైంది. బ్రెండన్‌ టేలర్‌ (44) టాప్‌ స్కోరర్‌. టఫాడ్జ్వా సిగా (33 నాటౌట్‌) ఫర్వాలేదనిపించాడు. హెన్రీ, జకారీ చేసిన ముప్పేట దాడిలో జింబాబ్వే బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. 

నిక్‌ వెల్చ్‌ (11), సీన్‌ విలియమ్స్‌ (11)తో సహా మిగతా వారు నిరాశపర్చారు. ఇన్నింగ్స్‌ మొత్తంలో ఏడుగురు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ ఆట ముగిసే టైమ్​కు తొలి ఇన్నింగ్స్‌లో 39 ఓవర్లలో 174/1 స్కోరు చేసింది. డేవన్‌ కాన్వే (79 బ్యాటింగ్‌), జాకబ్‌ డఫీ (8 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. కాన్వేతో కలిసి తొలి వికెట్‌కు 162 రన్స్‌ జత చేసి విల్‌ యంగ్‌ (74) ఔటయ్యాడు. ట్రెవర్‌ గ్వాండ ఒక వికెట్‌ తీశాడు. ప్రస్తుతం కివీస్‌ 49 రన్స్‌ లీడ్‌లో ఉంది.