రాఖీ పండుగ 2025: ఏ రాశి వారికి ఏ రంగు రాఖీ కట్టాలో తెలుసా..!

రాఖీ పండుగ 2025:  ఏ రాశి వారికి ఏ రంగు రాఖీ కట్టాలో తెలుసా..!

శ్రావణమాసం.. పౌర్ణమి రోజు అక్కా చెల్లెళ్లు.. అన్నా దమ్ముల హడావిడి అంతా ఇంతాకాదు.. ఆరోజే రాఖీ పండుగ.. రక్షాబంధనం. ఈ ఏడాది రాఖీ పండుగ ఆగస్టు 9 శనివారం వచ్చింది. అయితే జ్యోతిష్య శాస్త్రం రాశులు .. నక్షత్రాల గమనంపై ఆధారపడి ఉంటుంది.అయితే ఒక్కో  రంగు రాఖీ ఒక్కో రాశి వారి వారిపై ప్రభావంచూపుతుంది.  రాఖీ పండుగ రోజు ఏ రాశి వారికి ఏ రంగు రాఖీ కడితే శుభం జరుగుతుందో తెలుసుకుందాం. . . 

మేషరాశి:  ఈరాశికి  కుజుడు అధిపతి.   ఈరాశి వారికి ఎరుపు  ( Red)రంగు రాఖీ కట్టడం వలన  చాలా శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. అన్నదమ్ములు.. అక్కచెల్లెళ్ల మధ్య బంధం బలపడుతుంది.  జీవితంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెతతారు. 

వృషభ రాశి: ఈ రాశికి శుక్రుడు అధిపది.. మీ అన్నదమ్ములు వృషభ రాశికి చెందిన వారైతే  నీలం (Blue)రంగు  లేదా బూడిద(Grey) రంగు  రాఖీ కట్టండి.  మీ సోదరుడి జీవితంలో సానుకూల ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

మిథున రాశి: ఈ రాశికి బుధుడు అధిపతి.. సోదరుడికి ఎలాంటి ఇబ్బందులు .. ఆపదలు రాకుండా ఉండాలని సోదరీమణులు రక్షాబంధనం పండుగ రోజు రాఖీని కడతారు. జ్యోతిష్య శాస్త్రం ఈ ఏడాది మిథున రాశి వారికి ఆకు పచ్చని(Green), ఎరుపు(Red), గంధం ( Sandle)  రంగులో ఉండే రాఖీలను కట్టడం వల్ల మీ సోదరుడికి అన్నింటా విజయం లభిస్తుంది. కి అన్నింటా విజయం లభిస్తుంది.

Also Read:-రాఖీ కట్టేటప్పుడు ఎన్ని ముడులు వేయాలి.. 3, 5, 7 ఎన్నో తెలుసుకోండి..!

కర్కాటక రాశి:  ఈ రాశికి చంద్రుడు .  చంద్రుడు శుభ దృష్టితో అన్నింటా విజయమే.. ఈ రాశి వారికి చంద్రుడి ఆకారంలో ఉండే తెల్లని (White) రాఖీని కట్టాలి.  ఆర్థిక స్థోమత ఆధారంగా వెండి( Silver) రాఖీ కడితే ఇంకా మంచిది.  ఈ రాశి వారు సాధ్యమైనంత వరకు తెల్లని వస్తువులు  వాడితే ఈ ఏడాది అంతా ఆనందంగా ఉంటారని పండితులు చెబుతున్నారు. 

సింహ రాశి: ఈ రాశికి సూర్యుడు అధిపతి.  ఈరాశి వారికి రాఖీ కట్టేటప్పుడు ఎరుపు (Red) లేదా గులాబీ ( Rose)రంగుల రాఖీలను కట్టాలి.  వీరికి మనో బలం పెరిగి.. ఆలోచనా శక్తి వృద్ది చెందుతుంది. 

కన్య రాశి: ఈ రాశికి బుధుడు  అధిపతిగా ఉంటాడు.  వీరికి ఆకుపచ్చ (Green) , తెలుపు (White)  రంగుల్లో ఉండే రాఖీని కట్టాలి.  మీ సోదరులు హ్యాపీగా ఉంటారట.

తులా రాశి: ఈ రాశికి శుక్రుడు అధిపతి.. ఈ రాశివారికి రాఖీ కట్టేటప్పుడు నీలం (Blue)రంగు రాఖీ కట్టాలి. ఈ ఏడాది అంతా అన్నదమ్ములు.. అక్కచెల్లెళ్లు సంతోషంగా గడుపుతారు. 

వృశ్చిక రాశి:  ఈ రాశికి కుజుడు అధిపతిగా సంచరిస్తాడు.  వీరికి రాఖీ పండుగ రోజు ఎరుపు (Red) రంగు రాఖీని కట్టాలి.  మీ సోదరుని జీవితంలో ఆనందం రెట్టింపు అవుతుందని పండితులు చెబుతున్నారు. 

ధనస్సు రాశి: ఈ రాశికి గురుడు అధిపతి.   ఈ రాశిలో జన్మించిన వారికి రాఖీ కట్టేటప్పుడు పసుపు (Yellow)రంగు, గంధం ( Sandle) రంగు రాఖీలను కట్టాలి.  దీని వల్ల వారి కెరీర్​ విజయవంతంగా కొనసాగుతుంది. 

మకర రాశి:  ఈ రాశి వారిని శని భగవానుడు అధిపతిగా వ్యవహరిస్తాడు.  వీరికి రాఖీ కట్టేటప్పుడు నీలం (Blue) రంగు రాఖీని కట్టాలి. ఈ ఏడాది అంతా సంతోషంగా గడుపుతారు. 

కుంభ రాశి : ఈ రాశికి కూడా శని భగవానుడే అధిపతి .  వీరికి కూడా నీలం (Blue) రంగు రాఖీ కట్టాలి. సోదరులు ఎప్పుడూ సంతోషంగా ఉండేలా  శనిభగవానుడి ఆశీస్సులు ఉంటాయని పండితులు చెబుతున్నారు. 

మీన రాశి: ఈ రాశికి గురుడు అధిపతి.  ఈరాశిలో పుట్టిన వారికి రాఖీ కట్టేటప్పుడు పసుపు ( Yellow)రంగు రాఖీ కట్టాలి.  ఈ ఏడాది అంతా శుభ ఫలితాలు వస్తాయని పండితులు వస్తాయని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది.