75 లక్షల ఆర్డర్ల డెలివరీ.. జోమాటో, బ్లింకిట్ రికార్డ్

75 లక్షల ఆర్డర్ల డెలివరీ.. జోమాటో, బ్లింకిట్ రికార్డ్

న్యూఢిల్లీ: జోమాటో, బ్లింకిట్ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు కొత్త ఏడాది వేడుకల రోజున రికార్డు స్థాయిలో 75 లక్షల ఆర్డర్లను డెలివరీ చేశాయి. ఎటర్నల్ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ ఈ వివరాలను వెల్లడించారు. 4.5 లక్షల మందికి పైగా డెలివరీ భాగస్వాములు 63 లక్షల మంది కస్టమర్లకు సేవలందించారని ప్రకటించారు.   

వీళ్లకు ఈసారి సాధారణం కన్నా ఎక్కువ ప్రోత్సాహకాలు అందించామని తెలిపారు. అయితే, ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల నుంచి 14 వేల మంది సభ్యులు సహా 22 నగరాల నుంచి లక్ష మందికి పైగా కార్మికులు సమ్మెలో చేరారని గిగ్ అండ్ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ తెలిపింది.  కంపెనీలు ఇచ్చే ప్రోత్సాహకాలు, డెలివరీ రేట్లు తక్కువగా ఉన్నాయని, పెరిగిన ధరలకు అనుగుణంగా తమ కనీస వేతనాన్ని పెంచాలని కోరింది. ముఖ్యంగా పండుగలు, కొత్త ఏడాది వంటి రద్దీ సమయాల్లో ఇచ్చే అదనపు ప్రోత్సాహకాలపై స్పష్టత ఉండాలని డిమాండ్ చేసింది.