
న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ జొమాటో తన యాప్‌లో ‘హెల్తీ మోడ్’ అనే కొత్త ఫీచర్‌ను చేర్చింది. ప్రస్తుతం ఇది గురుగ్రామ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండగా, త్వరలో ఇతర నగరాలకు విస్తరించనుంది. రెస్టారెంట్ అందించే ఫుడ్‌కి ఏఐ, ఎల్‌ఎల్‌ఎం టెక్నాలజీల ఆధారంగా మాక్రోన్యూట్రియంట్ ప్రొఫైల్ రూపొందించి, ‘హెల్తీ స్కోర్’ను జొమాటో జతచేస్తుంది. ‘లో’ నుంచి ‘సూపర్’ వరకు ర్యాంక్ ఇస్తుంది. జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్ మాట్లాడుతూ, “ఇది ప్రారంభం మాత్రమే. ఎక్కువ మందికి మెరుగైన ఆహారం అందించాలనే లక్ష్యాన్ని చేరుకునేందుకు ఈ ఫీచర్‌ను తీసుకొచ్చాం” అని అన్నారు.