కేటరింగ్ బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి జొమాటో

కేటరింగ్ బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి జొమాటో
  • రెస్టారెంట్ల నుంచి డెలివరీ చేయనున్న కంపెనీ

న్యూఢిల్లీ: కేటరింగ్ బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి ఎంటర్ అవ్వాలని జొమాటో చూస్తోంది. రెస్టారెంట్లతో తనకున్న పార్టనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వాడుకోవాలని ప్లాన్ చేస్తోంది. పెద్ద మొత్తంలో ఆర్డర్లను  డెలివరీ చేయాలని ప్లాన్ చేస్తున్నామని కంపెనీ ఫుడ్ డెలివరీ సెగ్మెంట్  సీఈఓ రాకేష్​ రంజన్ పేర్కొన్నారు.

‘ఇప్పుడు మా ఇంటి దగ్గర 20 మంది  కలిశారనుకుంటే , ఇంత మందికి ఒకేసారి ఫుడ్ డెలివరీ చేయడం కుదరదు. పార్టీ  లేదా లోకల్ చిన్న పిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లాన్ చేసుకున్నా పెద్ద మొత్తంలో ఫుడ్ డెలివరీ కుదరదు. ఇలాంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ, ఫుడ్ డెలివరీ   ఈ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెద్దగా విస్తరించలేదు. ఈ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైనే మేము ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టాలని అనుకుంటున్నాం’ అని ఆయన వివరించారు.

ఒకేసారి వివిధ రెస్టారెంట్ల నుంచి ఆర్డర్స్ పెట్టుకోవడానికి మల్టీ కార్ట్ ఫీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఈ ఏడాది జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జొమాటో లాంచ్ చేసింది. ఫుడ్ డెలివరీ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ స్ట్రాటజీని మరింతగా విస్తరించాలని కంపెనీ చూస్తోంది. చిన్న సైజ్ ఆర్డర్లు పెట్టే వారిని ఆకర్షించేందుకు జొమాటో ఈ ఏడాది ఎవ్రిడే లాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. మరోవైపు  లాయల్టీ ప్రోగ్రాం జొమాటో గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద మరిన్ని ఆఫర్స్ చేస్తామని రాకేష్ అన్నారు.