స్విగ్గీ, జొమాటోకి రూ.750 కోట్ల జీఎస్‌‌టీ నోటీస్‌‌

స్విగ్గీ, జొమాటోకి రూ.750 కోట్ల జీఎస్‌‌టీ నోటీస్‌‌
  • డెలివరీని సర్వీస్‌‌గా చూడడమే కారణం!

న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ ప్లాట్‌‌ఫామ్స్ స్విగ్గీ, జొమాటోకి ట్యాక్స్ అధికారులు షాకిచ్చారు. రెండు కంపెనీలకు కలిపి సుమారు రూ.750 కోట్ల జీఎస్‌‌టీ నోటీసులు ఇష్యూ చేశారు. ఇందులో రూ.400 కోట్ల జీఎస్‌‌టీ కట్టాలని జొమాటోకి, రూ.350 కోట్ల నోటిసు స్విగ్గీకి ఇష్యూ చేశారు.  డెలివరీని సర్వీస్‌‌గా పరిగణించడంతో ఈ కంపెనీలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్‌‌టీ ఇంటెలిజెన్స్‌‌ (డీజీజీఐ) నోటీసులు పంపిందని సీఎన్‌‌బీసీ–టీవీ18 రిపోర్ట్ చేసింది.

2017 జులై నుంచి మార్చి 2023 మధ్య కాలానికి గాను ఈ జీఎస్‌‌టీ వేశారని తెలిపింది. లిస్టెడ్ కంపెనీ జొమాటో షేర్లు బుధవారం ఒక శాతం పడి రూ.115.45 దగ్గర ముగిశాయి. ఈ రెండు ఫుడ్ డెలివరీ ప్లాట్‌‌ఫామ్‌‌లు కూడా లాభాల్లోకి వచ్చామని ఈ ఏడాది ప్రకటించాయి. జొమాటో ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌లో రూ.36 కోట్ల నికర లాభం, రూ.2,848 కోట్ల రెవెన్యూ సాధించింది. అన్‌‌లిస్టెడ్ కంపెనీ స్విగ్గీ ఈ ఏడాది మార్చి క్వార్టర్‌‌‌‌లో లాభాల్లోకి వచ్చామని పేర్కొంది.