వర్షంపైన GST ఏంటయ్యా.. కస్టమర్లపై స్విగ్గీ, జొమాటో కొత్త బాదుడు !

వర్షంపైన GST ఏంటయ్యా.. కస్టమర్లపై స్విగ్గీ, జొమాటో కొత్త బాదుడు !

కొత్త జీఎస్టీ పాలసీ అమల్లోకి వచ్చాక చాలా వస్తువుల ధరలు తగ్గుతుంటే ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ అయిన స్విగ్గీ, జొమాటో మాత్రం కస్టమర్లపై ఆ ఫీజు.. ఈ ఫీజు అని ఎడాపెడా భారం మోపుతున్నాయి. వర్షంలో ఫుడ్ ఆర్డర్ ఇంటికి చేరాలంటే Rain Fee అని ఇప్పటికే కస్టమర్ల నుంచి ఛార్జీ వసూలు చేస్తున్న ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్స్ కొత్తగా GST on Rain Fee అని అదనంగా వసూలు చేస్తున్నాయి. రెస్టారెంట్ ప్యాకేజింగ్ ఛార్జీలు, ప్లాట్ ఫామ్ ఫీజు, వర్షం పడితే Rain Fee, రెస్టారెంట్ జీఎస్టీ.. ఇలా ఒక్క ఫుడ్ ఆర్డర్పై ఇన్ని రకాల ఛార్జీలు వసూలు చేస్తున్న ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ కొత్తగా GST on Rain Fee అని మరో బాదుడుకు పూనుకోవడంపై కస్టమర్ల నుంచి తీవ్ర ఆగ్రవేశాలు వ్యక్తమవుతున్నాయి.

ముందుముందు ఎండలు బాగా ఉంటే Sunlight Convenience Fee, గాలి పీలిస్తే Oxygen Maintenance Charge, GST on Breathing, Pay as you inhale ఇలా రకరకాల కారణాలు చెప్పి కస్టమర్లపై చిత్రవిచిత్ర ఛార్జీలు విధిస్తారేమోనని సోషల్ మీడియాలో సెటైరికల్ పోస్టులు కనిపిస్తున్నాయి. స్విగ్గీ, జొమాటోలు రోజుకు కోట్ల సంఖ్యలో ఫుడ్‌‌‌‌ ఆర్డర్లు డెలివరీ ఇస్తున్నాయి. వీటిపై ఆధారపడే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఫుడ్ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వేసే డెలివరీ ఫీజులు, జీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ, రెస్టారెంట్ ఛార్జీలు, హ్యాండ్లింగ్ ఛార్జీలకు అదనంగా ఇప్పటికే ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్ ఫీజు ముక్కు పిండి వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. మనం చెల్లించే ఈ ప్లాట్ ఫామ్ ఫీజు డైరెక్టుగా సదరు సంస్థలకే వెళ్తుంది. తమపై పడుతున్న ఖర్చుల భారాన్ని తగ్గించుకోవటం కోసమే జొమాటో, స్విగ్గీ సంస్థలు ఈ ప్లాన్ వేశాయి.