రెండో రోజు కొనసాగిన జోనల్ క్రీడలు

రెండో రోజు కొనసాగిన జోనల్ క్రీడలు

ములుగు, వెలుగు : ములుగు మండలం జాకారం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జరుగుతున్న జోనల్​స్థాయి క్రీడోత్సవాల్లో రెండో రోజూ కొనసాగాయి. మొత్తం 11పాఠశాలలకు చెందిన 935మంది విద్యార్థులు ఈక్రీడల్లో పాల్గొనగా, పలువురు విజేతలకు సీఐ సురేశ్​తోపాటు జోనల్ అధికారి దేవసేన, ఇంటర్మీడియట్​విద్యాధికారి చంద్రకళ, మెడల్స్​ అందజేశారు. ఈ సందర్భంగా 150 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో విద్యార్థులు సామూహిక వందేమాతర గీతం ఆలపించారు. 

పలువురు క్రీడాకారులు 14, 17, 17 ఏండ్ల విభాగాల్లో మెడల్స్​సాధించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్​ డాక్టర్​ వెంకటేశ్వర్లు, పీడీ వెంకట్​రెడ్డి, డీసీవోలు భిక్షపతి, జె.యాదగిరి, స్టాప్ సెక్రెటరీ యాదగిరి, వైస్ ప్రిన్సిపాల్ పిచ్చిరెడ్డి, ఉపాధ్యాయులు, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.