
హైదరాబాద్, వెలుగు : రూ.5వేలు లంచం తీసుకుంటూ జూపార్క్ సీనియర్ అసిస్టెంట్ సరఫ్ రమేశ్ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ ఆఫీసర్లు తెలిపిన వివరాల ప్రకారం.. సైదాబాద్‌కు చెందిన మహ్మద్ అజామ్ షరీఫ్ కుటుంబం కొంత కాలంగా జూపార్క్‌లో పనిచేస్తోంది. తల్లి పేరుతో ఉన్న ఫ్యామిలీ పెన్షన్‌ను తన సోదరి పేరు మీదికి మార్చాలని షరీఫ్ జూ అధికారులకు అప్లికేషన్పెట్టుకున్నాడు.
సంబంధిత ఫైల్జూపార్క్ సీనియర్ అసిస్టెంట్ సరఫ్ రమేశ్వద్ద పెండింగ్పెట్టడంతో, షరీఫ్ఆయన్ని కలిశాడు. ప్రాసెస్ చేయాలని కోరగా, అందుకు రమేశ్రూ.5వేలు లంచం డిమాండ్ చేశాడు. షరీఫ్ ఏసీబీని ఆశ్రయించడంతో గురువారం రమేశ్ పై నిఘా పెట్టారు. షరీఫ్నుంచి లంచం తీసుకుంటుండగా, రెడ్‌హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. అవినీతి అధికారులకు సంబంధించిన సమాచారాన్ని1064 టోల్‌ఫ్రీ నంబర్‌ద్వారా లేదా డైరెక్ట్‌గా ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ సూచించారు.