ZPTC , MPTC ఎన్నికల షెడ్యూల్ విడుదల

ZPTC , MPTC ఎన్నికల షెడ్యూల్ విడుదల

హైదరాబాద్ : రాష్ట్రంలో ZPTC , MPTC ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. పరిషత్ ఎన్నికల షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి మాసబ్ ట్యాంక్ లోని స్టేట్ ఎలక్షన్ ఆఫీస్ లో ప్రకటించారు. రాష్ట్రంలో 3 దశల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. మే 6, 10, 14 తేదీల్లో ZPTC, MPTC ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. బ్యాలెట్ పేపర్ పద్ధతిలో నిర్వహించే ఈ ఎన్నికల కౌంటింగ్ మే 27న జరుగుతుంది. ఫలితాలు అదే రోజు ప్రకటిస్తారు.

మొదటి దశ

ఏప్రిల్ 22న నోటిఫికేషన్ విడుదల

మే 6న పోలింగ్

రెండో దశ

ఏప్రిల్ 26న నోటిఫికేషన్ విడుదల

మే 10న పోలింగ్

మూడో దశ

ఏప్రిల్ 30 నోటిఫికేషన్ విడుదల

మే 14న పోలింగ్

అన్ని ఏరియాల్లోనూ నోటిఫికేషన్ విడుదలైన 3 రోజుల్లో నామినేషన్లు తీసుకుంటారు.

మే 27న కౌంటింగ్ జరుగుతుంది.

ZP ఎన్నికల సమాచారం

రాష్ట్రంలో మొత్తం 540 జిల్లా పరిషత్ లకు గానూ.. 539 జడ్పీటీసీలకు 3 దశల్లో ఎన్నికలు జరుగుతాయి. మంగపేట జిల్లా పరిషత్ కు కోర్టు కారణాలతో జరపడం లేదు.

మొదటి ఫేజ్ లో 197 జిల్లా పరిషత్ లు

రెండో ఫేజ్ లో 180 జిల్లా పరిషత్ లు

మూడో ఫేజ్ లో 161 జిల్లా పరిషత్ లు

జెడ్పీటీసీలకు వ్యయ పరిమితి రూ.5 లక్షలు

MP ఎన్నికల సమాచారం

రాష్ట్రంలో మొత్తం ఎంపీటీసీలు 5857.

ఇందులో 5817 ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పలు కారణాలతో 40 సెగ్మెంట్లలో ఎన్నికలు జరపడం లేదని నాగిరెడ్డి చెప్పారు.

మొదటి దశలో 2166 మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు

రెండో దశలో 1913 మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు

మూడో దశలో 1738 మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు

ఎంపీపీ, జెడ్పీపీ ఎన్నికల వివరాలు తర్వాత ప్రకటిస్తామని అధికారులు చెప్పారు.

బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి.

MPTC ఎన్నికలకు పింక్ కలర్ బ్యాలెట్ పేపర్

ZPTC ఎన్నికలకు వైట్ కలర్ బ్యాలెట్ పేపర్

రాష్ట్ర ఎన్నికల సంఘం  మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ గ్రామీణ ప్రాంతాల్లో అమలులో ఉంటుంది. రాష్ట్రమంతా ఆల్రెడీ ఈసీ ఎలక్షన్ కోడ్ అమలులో ఉంది.