జైకోవ్-డీ వ్యాక్సిన్.. దేశంలో మూడు డోసుల టీకాకు డీసీజీఐ అనుమతి

జైకోవ్-డీ వ్యాక్సిన్.. దేశంలో మూడు డోసుల టీకాకు డీసీజీఐ అనుమతి

దేశంలో మరో కరోనా వ్యాక్సిన్ కు అనుమతి ఇచ్చింది డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా. జైడస్ క్యాడిలా సంస్థ తయారు చేసిన చేసిన జైకోవ్-డీ వ్యాక్సిన్.. అత్యవసర వినియోగానికి DCGI అప్రూవల్ ఇచ్చింది. ఇది ప్రపంచంలోనే మొదటి DNA ఆధారిత వ్యాక్సిన్. ఇది మూడు డోసుల వ్యాక్సిన్. 12 ఏళ్లుపై బడిన వారంతా జైకోవ్-డీ తీసుకోవచ్చని సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ తెలిపింది. జైకోవ్-డీ ఎంట్రీతో.. దేశంలో అందుబాటులోకి వచ్చిన కరోనా వ్యాక్సిన్ల సంఖ్య ఆరుకు చేరింది. 

జైకోవ్-డీ అప్రూవల్ కోసం జులై 1న దరఖాస్తు చేసుకుంది క్యాడిలా సంస్థ. తమ వ్యాక్సిన్ 66.6 శాతం ఎఫెక్టీవ్ గా పనిచేస్తోందని చెప్పింది. డెల్టా వేరియంట్ పైనా తమ వ్యాక్సిన్ పనిచేస్తుందని చెప్పింది. దేశవ్యాప్తంగా 28వేల మంది వాలంటీర్లపై వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహించామని DCGIకి తెలిపింది. కేంద్ర బయోటెక్నాలజీ సంస్థ, జైడస్ క్యాడిలా కలిసి జైకోవ్-డీ వ్యాక్సిన్ ను తయారు చేశాయి.