క్రైస్ట్‌చర్చ్: బ్యాటింగ్‌లో కానర్ ఎస్టర్‌హైజెన్ (33 బాల్స్‌లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 75), రుబిన్ హెర్మాన్ (39) దంచికొట్టడంతో బుధవారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో సౌతాఫ్రికా 33 రన్స్ తేడాతో న్యూజిలాండ్‌పై గెలిచింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3–2తో సొంతం చేసుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 187/4 స్కోరు చేసింది. వియాన్ ముల్డర్ (31), రుబిన్ రెండో వికెట్‌కు 55 రన్స్ జోడించారు.
ఇక 76/2 స్కోరు వద్ద క్రీజులోకి వచ్చిన కానర్.. రుబిన్‌తో మూడో వికెట్‌కు 49, డియాన్ ఫారెస్టర్ (21 నాటౌట్)తో నాలుగో వికెట్‌కు 61 రన్స్ జోడించాడు. బెన్ సియర్స్ 2 వికెట్లు తీశాడు. ఛేజింగ్‌లో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 154/8 స్కోరుకే పరిమితమైంది. బేవన్ జాకబ్స్ (36) టాప్ స్కోరర్. గెరాల్డ్ కోయెట్జీ, వియాన్ ముల్డర్, బార్ట్‌మన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. కానర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘సిరీస్’ అవార్డులు లభించాయి.
