సింగర్ దియా.. అరెరె.. అరెరె ఆల్బమ్ రిలీజ్

సింగర్ దియా.. అరెరె.. అరెరె ఆల్బమ్ రిలీజ్

యాక్టర్ కమ్ సింగర్  దియా తాజాగా కొత్త మ్యూజిక్ ఆల్బమ్‌‌‌‌ను రూపొందించింది. ‘అరెరె.. అరెరె’ పేరుతో విడుదల చేసిన  ఈ  మ్యూజిక్ వీడియోకు క్రాంతి వర్మ దర్శకత్వం వహించగా, కె అండ్ ఎం రైటింగ్స్ కథను అందించారు. నూతన్ చెకురి నిర్మించారు.  

శరవణ వాసుదేవన్ సంగీతం అందించాడు. ఈ ఆల్బమ్ లాంచ్‌‌‌‌కు తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య, హీరో పూరి ఆకాష్, సంగీత దర్శకుడు రఘు కుంచె, నటులు సమీర్, సాగర్, శివారెడ్డి అతిథులుగా హాజరై టీమ్‌‌‌‌ను అభినందించారు. ఈ సందర్భంగా దియా మాట్లాడుతూ ‘ఈ ఆల్బమ్ రూపుదిద్దుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇది అందరికీ నచ్చేలా ఉంటుంది.  ప్రేక్షకుల ప్రేమ, ఆదరణే నాకు పెద్ద బలం’  అని చెప్పింది. మంచి ఎమోషన్స్‌‌‌‌తో రూపొందిన ఈ ఆల్బమ్‌‌‌‌ను ప్రతి ఒక్కరికీ ఆకట్టుకుంటుందని  దర్శకుడు క్రాంతి, నిర్మాత నూతన్ అన్నారు.