మోడీపై అవాస్తవాలు రాస్తారా?

మోడీపై అవాస్తవాలు రాస్తారా?
  • విదేశీ మీడియాపై హైకమిషనర్ ఫైర్

న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ వేవ్ పరిస్థితులను అదుపు చేయడంలో ప్రధాని మోడీ ఫెయిలయ్యారని విదేశీ మీడియా అనడంపై భారత్ సీరియస్ అయ్యింది. ఈ మేరకు మోడీని విమర్శిస్తూ కథనాలు రాసిన ఆస్ట్రేలియా వార్తా పత్రిక ది ఆస్ట్రేలియన్ ఎడిటర్ చీఫ్ క్రిస్టోఫర్ డోకు భారత హై కమిషనర్‌ లేఖ రాశారు. మోడీపై రాసిన కథనం పూర్తిగా నిరాధారమైనదని, అవాస్తవాలతో కూడుకున్నదని, ఇలాంటి అపవాదులు సరికావని లెటర్‌లో హై కమిషనర్ పేర్కోన్నారు. కరోనా మహమ్మారిపై కేంద్ర ప్రభుత్వం అలుపెరుగని పోరాటం జరుపుతున్న ఈ సమయంలో ఇలాంటి కథనాలు ప్రచురించడం సరికాదని ఆయన మండిపడ్డారు.