ఎయిర్‌‌టెల్‌‌ నుంచి ‘బ్లాక్‌‌’.. అన్నీ ఒకేచోట..

ఎయిర్‌‌టెల్‌‌ నుంచి ‘బ్లాక్‌‌’.. అన్నీ ఒకేచోట..
  • నెట్‌‌, డీటీహెచ్‌‌, మొబైల్‌‌ సేవలకు ఒకే బిల్‌‌ 

హైదరాబాద్‌‌, వెలుగు: తమ బ్రాడ్‌‌బ్యాండ్‌‌, డీటీహెచ్‌‌, మొబైల్‌‌ సేవలు వాడే కస్టమర్లు సులువుగా బిల్స్‌‌ చెల్లించేందుకు, అదనపు సదుపాయాలను పొందేందుకు ఆల్‌‌ ఇన్‌‌ వన్‌‌ ప్లాన్‌‌ ‘బ్లాక్‌‌’ను విడుదల చేస్తున్నట్లు ఎయిర్‌‌టెల్‌‌ వెల్లడించింది.  కస్టమర్లు ఒక్కో తేదీన ఒక్కో బిల్లు కట్టడం ఇబ్బందికరమని, ఈ కొత్త విధానంలో ఇటువంటి సమస్యలు ఉండవని తెలిపింది. రెండు లేదా అంతకు మించిన సేవలను (ఫైబర్‌‌, డీటీహెచ్‌‌, మొబైల్‌‌) కలిపి ఎయిర్‌‌టెల్‌‌ బ్లాక్‌‌గా ఎంచుకోవచ్చు. దీని ద్వారా ఒకే బిల్లు పొందవచ్చు. కస్టమర్‌‌ కేర్‌‌ నెంబర్‌‌ కూడా ఒకటే ఉంటుంది. కాల్‌‌ చేసిన 60 సెకన్ల లోపు కస్టమర్‌‌ కేర్ ఎగ్జిక్యూటివ్‌‌తో మాట్లాడొచ్చు.  ఏ సమస్య వచ్చినా త్వరగా పరిష్కరించుకోవచ్చు. అంతేగాక బ్లాక్‌‌ కోసం ప్రత్యేకంగా రిలేషన్‌‌షిప్‌‌ మేనేజర్లను అందుబాటులో ఉంచుతారు. సర్వీస్‌‌ విజిట్స్‌‌, ఇన్‌‌స్టాలేషన్‌‌ ఉచితం.  ఎయిర్‌‌టెల్‌‌ థ్యాంక్స్‌‌ యాప్‌‌ డౌన్‌‌లోడ్‌‌ చేసుకొని బ్లాక్‌‌ ప్లాన్‌‌ పొందవచ్చు.