పాకిస్థాన్ మంత్రికి ఒవైసీ చురకలు

పాకిస్థాన్ మంత్రికి ఒవైసీ చురకలు

పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషీకి ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చురకలంటించారు. కర్ణాటకలో కొద్ది రోజులుగా నడుస్తున్న హిజాబ్ వివాదంపై పాక్ విదేశాంగ మంత్రి చేసిన ట్వీట్ పై అసద్ కౌంటర్ ఇచ్చారు. ఆడ పిల్లల చదువుపై భారత్ కు పాకిస్థాన్ పాఠాలు చెప్పాల్సిన పని లేదన్నారు. పాకిస్థాన్ లో చదువుకోవడానికి బయటకు వచ్చిన మలాలాపై టెర్రరిస్టులు కాల్పులు జరపడంతో లండన్ వెళ్లి చదువుకోవాల్సి వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ ఎద్దేవా చేశారు. ‘‘మీ దేశంలో ఆడ పిల్లలకు రక్షణ కల్పించలేకపోయిన మీరు ఇప్పుడు భారత్ కు లెక్చర్లు ఇస్తున్నారా? ఈ దేశం మాది ఇది మా దేశం.. మా ఇంటి వ్యవహారంలో మీరు వేలు పెట్టొదు. మీ దేశంలో ఉన్న సమస్యలను మీరు పరిష్కరించుకోండి చాలు. బలూచ్ క్రైసిస్ సహా అనేక సమస్యలు ఉన్నాయి. వాటి సంగతి చూసుకోండి’’ అని ఒవైసీ స్పష్టం చేశారు. ఇవాళ ఉదయం యూపీలో ఎన్నికల ప్రచారం సందర్భంగా అసదుద్దీన్ ఒవైసీ పై వ్యాఖ్యలు చేశారు.

పాక్ మంత్రి ఏమన్నాడంటే..?

కర్ణాటక హిజాబ్ వివాదంపై పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ముస్లిం అమ్మాయిలను చదువుకు దూరం చేయడం ప్రాథమిక మానవ హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని ఆయన ట్వీట్ చేశారు. హిజాబ్ ధరించిన కారణంగా ఈ పని చేయడం అణచివేత ధోరణిని సూచిస్తుందని అన్నారు. దీనిపై ఒవైసీ సీరియస్ గా స్పందించారు. మీ సమస్యలను మీరు చూసుకోండి.. భారత్ విషయాల్లో జోక్యం చేసుకోవాల్సి అవసరం లేదు అని చెప్పారు.

మరిన్ని వార్తల కోసం..

సర్జరీలకు ముందు కొవిడ్ టెస్ట్ అక్కర్లేదు

మాకు అధికారమిస్తే రైతుల నుంచి ఆవు పేడ కొంటం

మమ్మల్ని గెలిపిస్తే.. బైక్పై ముగ్గురు వెళ్లినా నో చలాన్