మమ్మల్ని గెలిపిస్తే.. బైక్పై ముగ్గురు వెళ్లినా నో చలాన్

మమ్మల్ని గెలిపిస్తే.. బైక్పై ముగ్గురు వెళ్లినా నో చలాన్

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని పార్టీలు హోరాహోరీ పోరాడుతున్నాయి. ఇంటింటికీ తిరిగి ప్రచారం హోరెత్తిస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల హామీలు గుప్పిస్తున్నాయి. ప్రధాన పోటీదారుగా ఉన్న సమాజ్ వాదీ పార్టీతో పొత్తులో ఉన్న సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ  (SBSP) చీఫ్ ఓం ప్రకాశ్ రాజ్ భర్ ఓ వెరైటీ హామీ ఇచ్చారు. ప్రస్తుతం మోటార్ వెహికల్ చట్టం ప్రకారం టూవీలర్ పై ముగ్గురు ప్రయాణిస్తే జరిమానా విధిస్తారు.. అయితే తమకు అధికారమిస్తే ఈ రూల్ ఎత్తేస్తామని ఓం ప్రకాశ్ చెప్పారు. తాము గెలిచి, ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బైక్ పై ముగ్గురు వెళ్లేందుకు అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు.

టూవీలర్స్ పై త్రిబుల్ రైడింగ్ ను సమర్థిస్తూ ఓం ప్రకాశ్ తన వాదనను వినిపించారు. ఒక ట్రైన్ కోచ్ లో 70 సీట్లు ఉంటే 300 మంది ప్రయాణికులను ఎలా అనుమతిస్తున్నారని ప్రశ్నించారు. మరి ట్రైన్లకు చలాన్ ఎందుకు విధించడం లేదు.. బైక్ పై ముగ్గురు వెళ్తేనే చలాన్ ఎందుకు వేస్తున్నారని నిలదీశారు. తమ ప్రభుత్వం ఏర్పడితే బైక్ పై ముగ్గురు ప్రయాణించినా చలాన్లు విధించబోమని, లేదా సీటింగ్ కెపాసిటీకి మించి ప్రయాణించే జీపులు, రైళ్లపై జరిమానాలు వేస్తామని ఓం ప్రకాశ్ తెలిపారు.

మరిన్ని వార్తల  కోసం..

కేసీఆర్ వ్యాఖ్యలను డైవర్ట్ చేసేందుకే టీఆర్ఎస్ నిరసనలు

బికినీనా?.. బుర్ఖానా? ఏం వేసుకోవాలా అన్నది వాళ్ల ఇష్టానికే వదిలేయండి

జట్టుతో కలసి రఫ్ఫాడిస్తానంటున్న బిగ్ బీ