
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమను గెలిపిస్తే.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పది రోజుల్లోనే రైతుల రుణాలను మాఫీ చేస్తామని ప్రియాంకా గాంధీ వాద్రా తెలిపారు. ‘ఉన్నతి విధాన్ జన్ ఘోష్న’ పేరుతో కాంగ్రెస్ పార్టీ రూపొందించిన యూపీ ఎన్నికల మేనిఫెస్టోను బుధవారం విడుదల చేశారు. ప్రజల నుంచి సలహాలు తీసుకుని తమ మేనిఫెస్టో సిద్ధం చేశామని చెప్పారామె.
Congress leader Priyanka Gandhi Vadra launches the Congress manifesto 'Unnati Vidhan Jan Ghoshna Patra-2022' for #UttarPradeshElections pic.twitter.com/63uoNspG9x
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 9, 2022
మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలు
- అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే రైతు రుణ మాఫీ.
- రైతుల నుంచి కిలో రెండు రూపాయల చొప్పున ఆవు పేడ కొనుగోలు చేసి, దానిని వర్మీ కంపోస్ట్ గా మారుస్తామని ప్రియాంకా గాంధీ హామీ ఇచ్చారు.
- కరోనాతో ఇబ్బందిపడిన ప్రతి కుటుంబానికి రూ.25 వేల సాయం.
- 20 లక్షల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు.
- రోగాల బారినపడితే చికి్తస కోసం రూ.10 లక్షల వరకు ప్రభుత్వ సాయం.
- రాష్ట్రంలో చిన్న, మధ్య తరహా బిజినెస్ లు తీవ్రంగా దెబ్బతిన్నాయని, వాటిని ఆదుకుంటామని, క్లస్టర్లను డెవలప్ చేస్తామని ప్రియాంక చెప్పారు.
- స్కూల్ ఫీజులపై నియంత్రణ.
- రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల టీచర్ పోస్టుల భర్తీ.
- టీచర్లు, శిక్షక మిత్రలను రెగ్యులరైజ్ చేస్తం.
- కేజీ నుంచి పీజీ వరకు గిరిజనులు, బీసీలకు ఉచిత విద్య.
-
క్వింటాల్ వరికి, గోధుమకు రూ.2500 చొప్పున, చెరుకుకి రూ.400 మద్దతు ధర.
-
రైతుల కరెంట్ బిల్లుల మాఫీ.