కరోనా టెస్టులపై ఢిల్లీ ఎయిమ్స్ కీలక నిర్ణయం

కరోనా టెస్టులపై ఢిల్లీ ఎయిమ్స్ కీలక నిర్ణయం

దేశ రాజధాని ఢిల్లీలో రోజు వారీ కరోనా కేసులు భారీగా తగ్గుతుండడంతో ఢిల్లీ ఎయిమ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. చికిత్సల కోసం ఆస్పత్రిలో చేరేవాళ్లు, సర్జరీలు చేయించుకునే వాళ్లకు కరోనా టెస్టు చేయడం ఇకపై తప్పనిసరి కాదని ప్రకటించింది. ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిమ్స్ తన ప్రకటనలో తెలిపింది. ‘‘ఏదైనా అనారోగ్యంతో అప్పటి ఎయిమ్స్ లో చికిత్స పొందుతుండగా.. కరోనా పాజటివ్ వచ్చి కొవిడ్ వార్డుకు పంపిన పేషెంట్ ను కోలుకున్నాక మరోసారి ప్రత్యేకంగా టెస్టు చేయాల్సిన అవసరం లేదు. కొవిడ్ డిపార్ట్ మెంట్ లో నెగిటివ్ వచ్చాక దానితోనే మళ్లీ పాత ట్రీట్ మెంట్ కోసం సంబంధిత డిపార్ట్ మెంట్ లో అడ్మిట్ చేయొచ్చు’’ అని ఎయిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డీకే శర్మ వెల్లడించారు.

మరిన్ని వార్తల కోసం..

మాకు అధికారమిస్తే రైతుల నుంచి ఆవు పేడ కొంటం

మమ్మల్ని గెలిపిస్తే.. బైక్పై ముగ్గురు వెళ్లినా నో చలాన్

కేసీఆర్ వ్యాఖ్యలను డైవర్ట్ చేసేందుకే టీఆర్ఎస్ నిరసనలు