సూర్యవంశీ వరల్డ్ ఫాస్టెస్ట్ సెంచరీ

సూర్యవంశీ  వరల్డ్ ఫాస్టెస్ట్ సెంచరీ
  • యూత్ వన్డేల్లో  సూర్యవంశీ  వరల్డ్ ఫాస్టెస్ట్ సెంచరీ
  • వంద కొట్టిన యంగెస్ట్ క్రికెటర్‌‌‌‌‌‌‌‌గానూ రికార్డు

వార్సెస్టర్: ఐపీఎల్‌‌‌‌లో ధనాధన్ బ్యాటింగ్‌‌‌‌తో వెలుగులోకి వచ్చిన ఇండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (78 బాల్స్‌‌‌‌లో 13 ఫోర్లు, 10 సిక్సర్లతో 143) క్రికెట్ చరిత్రలో మరో అరుదైన రికార్డు సాధించాడు. ఇంగ్లండ్‌‌‌‌ అండర్–-19తో శనివారం జరిగిన నాలుగో యూత్ వన్డేలో కేవలం 52 బాల్స్‌‌‌‌లోనే సెంచరీ కొట్టాడు. దాంతో యూత్ వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన యంగెస్ట్ బ్యాటర్‌‌‌‌గా 14 ఏండ్ల, 100 రోజుల వైభవ్ చరిత్రకెక్కాడు.  పాక్ క్రికెటర్  కమ్రాన్ గులాం నెలకొల్పిన ఫాస్టెస్ట్ సెంచరీ (53 బాల్స్‌‌‌‌),  బంగ్లాదేశ్ బ్యాటర్‌‌‌‌‌‌‌‌ నజ్ముల్ హుస్సేన్ శాంటో పేరిట ఉన్న యంగెస్ట్ సెంచూరియన్‌ (14 ఏండ్ల 241 రోజుల వయసులో) రికార్డులను బ్రేక్ చేశాడు. యూత్‌‌‌‌ వన్డే మ్యాచ్‌‌‌‌లో పది సిక్సర్లు కొట్టిన తొలి ప్లేయర్‌‌‌‌‌‌‌‌గానూ నిలిచాడు. అతని ఖతర్నాక్ సెంచరీతో ఇండియా అండర్‌‌‌‌‌‌‌‌19 టీమ్  55 రన్స్ తేడాతో ఇంగ్లండ్‌‌‌‌ను ఓడించి 3–1తో సిరీస్ సొంతం చేసుకుంది. వైభవ్, విహాన్ మల్హోత్రా (129) సెంచరీల జోరుతో తొలుత ఇండియా 363/9 స్కోరు చేసింది. ఛేజింగ్‌‌‌‌లో ఇంగ్లండ్ 45.3 ఓవర్లలో 308 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. ఇరు జట్ల మధ్య చివరి, ఐదో వన్డే సోమవారం జరుగుతుంది.