ఆ టైమ్‌లో కన్నీళ్లు ఆగలేదు

ఆ టైమ్‌లో కన్నీళ్లు ఆగలేదు

న్యూఢిల్లీ: టీమిండియా టెస్ట్ క్రికెట్ హిస్టరీలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో ఛటేశ్వర్ పుజారా నిలుస్తారనడంలో సందేహం లేదు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ సిరీస్‌‌ల్లో తన బ్యాట్ పవర్ ఏంటో ఈ సీనియర్ బ్యాట్స్‌మన్ చూపాడు. అలాంటి పుజారా కూడా గడ్డు కాలాన్ని ఎదుర్కొన్నాడు. తన కెరీర్‌‌లో అత్యంత క్లిష్టమైన సమయాన్ని ఎలా అధిగమించాననే విషయాన్ని రీసెంట్‌‌గా ఓ ఇంటర్వ్యూలో పుజారా బయటపెట్టాడు. ఆ టైమ్‌లో చాలా ఏడ్చానని, కన్నీళ్లను ఆపుకోలేక పోయానన్నాడు.  

‘నా కెరీర్‌‌లో తొలిసారి నేను గాయపడినప్పుడు దాని నుంచి బయట పడటం చాలా కష్టంగా అనిపించింది. ఆ ఇంజ్యురీ నుంచి రికవర్ అవ్వడానికి ఆరు నెలలు పడుతుందని టీమ్ ఫిజియో చెప్పారు. దీంతో నేను చాలా నిరాశ, ఆందోళనకు గురయ్యా. ఏం చేయాలో పాలుపోక ఏడ్చేశా. అప్పుడు నేను నెగిటివ్ మైండ్‌‌సెట్‌‌తో ఉన్నా. మళ్లీ క్రికెట్ ఆడగలనా? ఒకవేళ ఆడినా ఇంటర్నేషనల్ లెవల్‌లో రాణించగలనా అనే సందేహాలతో నా బుర్ర హీటెక్కిపోయింది. అయితే నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌‌తో దీని గురించి మాట్లాడాను. వాళ్లు నాకు అండగా నిలిచారు. నాలో సానుకూల ధోరణి పెరిగేలా చూశారు. దీంతో నా ఫ్యూచర్ గురించి ఆలోచించడం ఆపేసి, వర్తమానంపై దృష్టి పెట్టా’ అని పుజారా పేర్కొన్నాడు. నెగిటివ్ మైండ్‌సెట్‌‌లో ఉంటే అన్నీ ప్రతికూలంగా కనిపిస్తాయని ఈ నయా వాల్ చెప్పాడు. పాజిటివ్ మైండ్‌సెట్‌‌తో ఉండటానికి యోగా, మెడిటేషన్, ప్రార్థన తనకు చాలా ఉపయోగపడ్డాయని వివరించాడు.