ఇంటింటికీ రేషన్ డెలివరీ చేస్తే తప్పేంటి?

ఇంటింటికీ రేషన్ డెలివరీ చేస్తే తప్పేంటి?

న్యూఢిల్లీ: రేషన్ సరుకులను నేరుగా ప్రజల ఇళ్ల వద్దకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతి ఇవ్వాలని ప్రధాని మోడీని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కోరారు. కరోనా విజ‌ృంభిస్తున్న ఈ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసికట్టుగా వైరస్‌పై పోరాటాన్ని సాగించాలని పిలుపునిచ్చారు. కరోనా సోకుతుందేమోనని భయపడి కొందరు ప్రజలు బయటకు రావడం లేదని, కాబట్టి అలాంటి వారికి, వృద్ధులకు రేషన్ సరుకులను డోర్ డెలివరీ చేయడంలో తప్పేంటని ప్రశ్నించారు. మన దేశంలో పిజ్జా, బర్గర్‌‌లను హోమ్ డెలివరీ చేస్తున్నప్పుడు రేషన్ సరుకులను ఇంటింటికీ పంపిణీ చేయడంలో తప్పేంటని క్వశ్చన్ చేశారు. డోర్‌స్టెప్ డెలివరీ ద్వారా రేషన్ మాఫియా ఆటకట్టించడం ప్రభుత్వానికి సులువు అవుతుందని పేర్కొన్నారు. వచ్చే వారం రాష్ట్రంలో డోర్‌స్టెప్ రేషన్ డెలివరీ పథకాన్ని అమల్లోకి తీసుకొస్తున్నామని తెలిపారు.