జర్నలిస్టు వర్సెస్ రాజకీయ నాయకుడి ముఖాముఖి కథే ‘మారన్’ మూవీ

జర్నలిస్టు వర్సెస్ రాజకీయ నాయకుడి ముఖాముఖి కథే ‘మారన్’ మూవీ

‘జీవితంలో నిజాయతీగా ఉండటం ఎంతో ముఖ్యం. దానికంటే ముఖ్యం సమర్థుడిగా ఉండటం’ అంటూ ఓ తండ్రి తన కొడుక్కి చెప్పాడు. దాన్నే ఫాలో అవుతూ పెరిగి పెద్దయ్యాడా అబ్బాయి. ఓ ఫేమస్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అయ్యాడు. అతనితో పెట్టుకుంటే ఎవరైనా ఓడిపోవాల్సిందే. ప్రజలకు నిజాల్ని చేరవేయడం కోసం ప్రాణాల్ని కూడా పణంగా పెట్టేస్తాడు. ఆ పట్టుదల వల్ల అతనికెలాంటి సమస్యలు వచ్చాయి? వాటిని అతను ఎలా ఎదుర్కొన్నాడు? తనను అణచివేయాలని చూసిన ఓ రాజకీయ నాయకుడికి ఎలా బుద్ధి చెప్పాడు? ఇదే ‘మారన్’ మూవీ కథ.

నిన్న రిలీజైన ట్రైలర్‌‌‌‌ని బట్టి ఈ కథను దర్శకుడు కార్తీక్ నరేన్‌‌ చాలా ఇంటరెస్టింగ్​గా తెరకెక్కించాడని అర్థమయ్యింది. మారన్ పాత్రలో ధనుష్ ఒదిగిపోయాడు. ఎవరినీ లెక్కచేయని జర్నలిస్టుగా అతని నటన, బాడీ లాంగ్వేజ్, డైలాగ్‌‌ డెలివరీ ఆకట్టుకున్నాయి. ధనుష్‌‌ని ప్రేమించి, అతనికి అన్నింట్లో తోడుగా నిలిచే అమ్మాయిగా మాళవికా మోహనన్ కనిపిస్తోంది. విలన్‌‌గా సముద్రఖని, హీరో తండ్రిగా రాంకీ నటించారు. ఇదో పవర్‌‌‌‌ఫుల్‌‌ సబ్జెక్ట్‌‌ అని, అన్ని ఎమోషన్స్ ఉన్న ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌ అని గతంలో దర్శకుడు చెప్పాడు. అది నిజమేనని ట్రైలర్‌‌ నిరూపించింది. మార్చ్‌‌ 11న ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్‌‌స్టార్‌‌‌‌లో విడుదల కానుంది.