‘త్రెడ్  పోచంపల్లి’ జూన్ 5 నుంచి 7 వరకు హైటెక్స్ లో ఎగ్జిబిషన్

‘త్రెడ్  పోచంపల్లి’ జూన్ 5 నుంచి 7 వరకు హైటెక్స్ లో ఎగ్జిబిషన్

యాదాద్రి, వెలుగు: చేనేత కళాకారులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని యాదాద్రి కలెక్టర్​ అనురాగ్​ జయంతి తెలిపారు. ‘త్రెడ్​ పోచంపల్లి’ పేరుతో హైదరాబాద్​లోని హెటెక్స్​లో ఎగ్జిబిషన్​ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సోమవారం కలెక్టరేట్​లో అడిషనల్​ కలెక్టర్​ వెంకారెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. పోచంపల్లి వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ఉన్నప్పటికీ.. మార్కెటింగ్​లో వెనుకబడడంతో చేనేత కళాకారులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.

ఉత్పత్తుల మార్కెటింగ్​ విషయంలో చేయూతనిచ్చేందుకు హైటెక్స్​లో వచ్చే నెల 5 నుంచి 7 వరకు ఎగ్జిబిషన్  ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇక్కత్  వస్త్రాల ప్రదర్శన కోసం వంద స్టాల్స్​ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మహిళా సంఘాల ఉత్పత్తుల కోసం 20 స్టాల్స్​ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ ఎగ్జిబిషన్​ను సీఎం రేవంత్​రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. పోచంపల్లి గ్రామాన్ని టూరిజం కేంద్రంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్​ చెప్పారు.