చప్పట్లు కొట్టి, దేవుణ్ని ప్రార్థిస్తే కరోనా పోదు

చప్పట్లు కొట్టి, దేవుణ్ని ప్రార్థిస్తే కరోనా పోదు

న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ విజృంభణకు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శించారు. అవసరమైన మేర ఆక్సీజన్ బెడ్‌‌లను అందుబాటులో ఉంచడంలో సర్కార్ విఫలమైందని మండిపడ్డారు. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందని.. కరోనాను ఎదుర్కోవడంలో ప్రభుత్వ వ్యూహం సరికాదన్నారు. కరోనా నియంత్రణకు అనూహ్యంగా లాక్‌డౌన్ వేయడం, చప్పట్లు కొట్టమనడం, దేవుడ్ని ప్రార్థించమనడమే ప్రభుత్వ వ్యూహాలని పేర్కొంటూ రాహుల్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.