చరిత్రలో ఇలాంటి ప్రశ్నలు అవసరం: చంద్రబోస్

చరిత్రలో ఇలాంటి ప్రశ్నలు అవసరం: చంద్రబోస్

తెరకెక్కిస్తున్న చిత్రం ‘23’. రియల్ లైఫ్‌‌ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందించిన ఈ సినిమాలో తేజ, తన్మయి లీడ్ రోల్స్‌‌లో నటించారు. స్టూడియో 99 సంస్థ నిర్మించింది. మే 16న సినిమా విడుదల కానుంది.  మంగళవారం ట్రైలర్‌‌‌‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఈవెంట్‌‌కు ముఖ్య​అతిథిగా హాజరైన చంద్రబోస్ మాట్లాడుతూ ‘నిలువెత్తు నిజాయితీ ఉన్న  దర్శకుడు రాజ్‌‌.. వజ్ర సంకల్పంతో సినిమాలు తీస్తారు. పాటలు రాయడం కోసం ఈ సినిమా చూశా. మంచి సాహిత్యం రాసే అవకాశం దక్కింది. నటీనటులంతా చాలా సహజంగా పాత్రలలో ఒదిగిపోయారు’ అని చెప్పారు. 

మరో అతిథి ప్రియదర్శి మాట్లాడుతూ ‘‘మల్లేశం’తో నా కెరీర్‌‌‌‌కి కొత్త ఊపిరినిచ్చిన వ్యక్తి రాజ్ గారు.  ఇందులో నటించమని రాజ్ అడిగారు. కానీ వేరే ప్రాజెక్ట్స్ వల్ల కుదరలేదు. ఇలాంటి గొప్ప ఆలోచన, కథతో ప్రేక్షకులు ముందుకు వస్తున్న రాజ్‌‌ను చూస్తుంటే గర్వంగా ఉంది. చరిత్రలో ఇలాంటి ప్రశ్నలు అడగడం చాలా అవసరం. ట్రైలర్ చూశాక నేను చేసుంటే బాగుండేదని చిన్నఈర్ష్య కలిగింది’ అన్నాడు.  దర్శకుడు  రాజ్ రాచకొండ మాట్లాడుతూ ‘క్యాలిక్యులేషన్స్‌‌తో చేసిన సినిమా కాదిది. ఇలాంటి సినిమాలు థియేటర్స్‌‌లో ఆడితే థియేటర్స్ కల్చర్ బావుంటుంది. ప్రభుత్వాలు కూడా ఎంకరేజ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నా’ అన్నారు.  నటీనటులు తన్మయి, తేజ, పావోన్ రమేష్, ప్రణీత్‌‌ తదితరులు పాల్గొన్నారు.