- లోక్ సభలో లేవనెత్తిన ఎంపీ చామల
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో రిజనల్ రింగ్ రోడ్డు(ట్రిపుల్ ఆర్)కు సమాంతరంగా నిర్మించ తలపెట్టిన ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టుకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం లోక్ సభ లో రూల్ 377 కింద ఈ అంశాన్ని లేవనెత్తారు. రిజనల్ రైల్వేలైన్ ప్రాజెక్టు హైదరాబాద్ చుట్టూ దాదాపు 400 కి.మీ విస్తరించి, సుమారు 8 జిల్లాలు, 14 మండలాలను కలుపుతుందని తెలిపారు. ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.
12 వేలకోట్లని వివరించారు. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా ఎదగాలని తెలంగాణ లక్ష్యంగా పెట్టుకుందని, ఇది సాకారం కావడంలో ఈ రైల్వేలైన్ కీలకపాత్ర పోషించనుందని చెప్పారు.

