అశ్వారావుపేట నియోజకవర్గంలో గ్రామాల అభివృద్ధికి రూ.5.13 కోట్లు మంజూరు : ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

అశ్వారావుపేట నియోజకవర్గంలో గ్రామాల అభివృద్ధికి రూ.5.13 కోట్లు మంజూరు : ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

చండ్రుగొండ, వెలుగు : అశ్వారావుపేట నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో గ్రామాల అభివృద్ధికి గాను ఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా రూ.5.13 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తెలిపారు. శనివారం చండ్రుగొండలోని రైతువేదిక లో 36 మంది లబ్ధిదారులకు రూ.8 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, స్కూళ్లకు రిపేర్లు, తాగునీటి సమస్యలు లాంటి వాటికి ఈ నిధులు ఖర్చుచేయనున్నట్లు తెలిపారు. 

నియోజకవర్గంలో రూ.48 లక్షల విలువైన సీఎంఆర్​ఎఫ్​ చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలున్న వారికి 90శాతం సబ్సిడీపై రూ.లక్ష విలువైన యూనిట్లు ప్రోత్సాహకంగా  ప్రభుత్వం మంజూరు చేసినట్లు చెప్పారు. మేకలపెంపకం, గొర్రెలు, పందులు, కోళ్ల పెంపకం లాంటి యూనిట్లు మంజూరు చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు భోజ్యానాయక్, కృష్ణారెడ్డి, సురేశ్, రమణ, తదితరులు పాల్గొన్నారు.

కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ 

అశ్వారావుపేట: దేశ సమగ్రతను కాపాడాలంటే ఓటు కీలకమని, ఆ ఓటు దొంగలించబడుతుందని, దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. ఈ మేరకు శనివారం అశ్వారావుపేట పట్టణంలో రింగ్ రోడ్డు సెంటర్ నుంచి భద్రాచలం రోడ్డులోని సంతపాకల వరకు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. మోదీ చేస్తున్న  లక్షల ఓట్లు గల్లంతుపై రాహుల్ గాంధీ చెప్పిన విధంగా తొలగించబడ్డాయని దానిలో బాగానే ఓటు కాపాడుకునే దశలోనే కొవ్వొత్తులతో నిరసన ర్యాలీని నిర్వహిస్తున్నట్లు ఆయన 
తెలిపారు.