మల్లూరు శివారు లోని హేమాచల నృసింహుడి హుండీ లెక్కింపు

మల్లూరు శివారు లోని హేమాచల నృసింహుడి హుండీ లెక్కింపు

మంగపేట, వెలుగు: ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు శివారులోని హేమాచల నృసింహ స్వామి ఆలయ హుండీని శుక్రవారం దేవస్థానం కార్యనిర్వాణాధికారి వీరస్వామి, దేవదాయ ధర్మాదాయ శాఖ పరిశీలకులు కురవి దేవస్థానం కార్యనిర్వాణాధికారి సత్యనారాయణ ఆధ్వర్యంలో లెక్కించారు. 

కానుకలు, మొక్కుబడులు ద్వారా ఆదాయం రూ.9,22,224 సమకూరినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ సురేశ్, కమిటీ సభ్యులు, అర్చకులు, సిబ్బంది, గ్రామస్తులు, మణుగూరు శ్రీవారి సేవబృందం సభ్యులు పాల్గొన్నారు.