హైదరాబాద్ లో గోల్డ్‌‌‌‌ మ్యాన్‌‌‌‌పై ఐటీ కొరడా..బినామీ చట్టం కింద ఆస్తుల జప్తు

హైదరాబాద్  లో గోల్డ్‌‌‌‌ మ్యాన్‌‌‌‌పై ఐటీ కొరడా..బినామీ చట్టం కింద ఆస్తుల జప్తు
  • రాయదుర్గ్‌‌‌‌లో ఐదంతస్తుల భవనం అటాచ్ 
  • నెలకు రూ.3.2 లక్షల అద్దె.. భార్య ఖాతా నుంచి భర్తకు బదిలీ
  • కోటి విలువైన 700 గ్రాముల బంగారం స్వాధీనం

హైదరాబాద్, వెలుగు: ‘గోల్డ్ మ్యాన్’గా ప్రచారం చేసుకున్న యాదగిరి చిన్న గౌడ్ అలియాస్ దర్గా చిన్న పహిల్వాన్‌‌‌‌పై ఇన్‌‌‌‌కమ్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌ (ఐటీ) డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ కొరడా ఝళిపించింది. బినామీ చట్టం కింద ఆస్తులు జప్తు చేస్తుంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌‌‌‌ రాయదుర్గ్‌‌‌‌లోని ఐదు అంతస్తుల రెసిడెన్షియల్‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌ను బినామీ ఆస్తిగా గుర్తించింది.ఈ మేరకు ఆ బిల్డింగ్‌‌‌‌ను బినామీ ప్రొహిబిషన్ యూనిట్ తాత్కాలికంగా జప్తు చేసింది.

బిల్డింగ్‌‌‌‌ ద్వారా వస్తున్న అద్దె ఆదాయంపైనా ఆంక్షలు విధించింది. కాగా, బిల్డింగ్‌‌‌‌ యాదగిరి ప్రణయ్ గౌడ్ పేరిట రిజిస్టర్ అయినప్పటికీ ప్రణయ్ గౌడ్‌‌‌‌కు చిన్న గౌడ్‌‌‌‌తో సంబంధం ఉన్నట్లుగా ఐటీ విచారణలో వెల్లడైనట్లు సమాచారం. భవనంలో గ్రౌండ్ ఫ్లోర్‌‌‌‌తో పాటు ఐదంతస్తులు ఉండగా, ప్రతి అంతస్తులో రెండు చొప్పున 2 బీహెచ్‌‌‌‌కే ఫ్లాట్లు ఉన్నాయి. వీటిలో అద్దె ద్వారా గోల్డ్‌‌‌‌మ్యాన్‌‌‌‌కు అదనపు ఆదాయం సమకూరుతున్నట్లు ఐటీ శాఖ గుర్తించింది.

టీవీలో ఇంటర్వ్యూలు ఇచ్చి ఐటీకి చిక్కి..

యాదగిరి చిన్న గౌడ్‌‌‌‌ అలియాస్‌‌‌‌ చిన్న పహిల్వాన్‌‌‌‌, గోల్డ్‌‌‌‌మ్యాన్‌‌‌‌ ఏప్రిల్ 3న పలు టీవీ చానల్స్‌‌‌‌తో పాటు యూట్యూబ్‌‌‌‌లో ఇంటర్వ్యూలు ఇచ్చాడు. తన ఒంటిపై ఉన్న బంగారంతో పాటు ఇతర వివరాలు వెల్లడించారు. దీంతో ఐటీ శాఖ అధికారులు.. ఆదాయపు పన్ను చట్టం-2025లోని సెక్షన్ 247 కింద ఆయనను విచారణకు పిలిచి ప్రశ్నించినట్లు సమాచారం. కాగా, చిన్న గౌడ్‌‌‌‌ వద్ద లభించిన 900 గ్రాముల బంగారంలో లెక్కలు చూపని 700 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

దీని విలువ సుమారు రూ.కోటి ఉంటుందని అంచనా వేశారు. అలాగే భూములు, అద్దెల ద్వారా వస్తున్న ఆదాయంపైనా అధికారులు ఆరా తీశారు. ఈ క్రమంలోనే ఆయన ఆదాయపు పన్ను రిటర్నుల్లో వార్షిక ఆదాయం సుమారు రూ.4 లక్షలుగా నమోదై ఉన్నట్లు ఐటీ శాఖ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే రాయదుర్గ్‌‌‌‌లో ఐదంతస్తుల బిల్డింగ్‌‌‌‌ బినామీ ప్రణయ్‌‌‌‌గౌడ్‌‌‌‌గా ఆధారాలు సేకరించారు. పెద్ద మొత్తంలో ఆస్తి కొనుగోలు, నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వచ్చాయన్న కోణంలో ఐటీ అధికారులు విచారణ చేపట్టారు.

నెలకు రూ.3.2 లక్షలు అద్దె చిన్న గౌడ్ భార్య అకౌంట్లలోకి..

కమర్షియల్‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌లో నెలకు రూ.3.2 లక్షలకు పైగా అద్దె వస్తున్నట్లు ఐటీ విచారణలో వెల్లడైంది. ఈ డబ్బు బిల్డింగ్‌‌‌‌తో ఎలాంటి సంబంధం లేదని చెబుతున్న చిన్నగౌడ్‌‌‌‌ భార్య బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు ఐటీ పరిశీల నలో వెల్లడైంది. అనంతరం ఆ మొత్తాన్ని ఆమె భర్త ఖాతాలకు బదిలీ చేసినట్లు గుర్తించారు. ప్రతి నెలా సుమారు రూ.1.76 లక్షలు తనకు అందుతున్నాయని, గతంలో ప్రణయ్‌‌‌‌కు ఇచ్చిన అప్పు తిరిగి చెల్లింపుల రూపంలో ఆ డబ్బు వస్తోందని ఆయన వివరించినట్లు సమాచా రం.

అయితే, ఇందుకు సంబంధించి లోన్‌‌‌‌ డాక్యుమెంట్లు లేకపోవడం, బిల్డర్లకు చెల్లింపుల కోసం తాను రుణం పొందినట్లు ఆధారాలు చూపకపోవడంతో బినామీగా ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రణయ్ గౌడ్‌‌‌‌ను బినామీదార్‌‌‌‌గా, ఆయన బావమరిదిని అసలు లబ్ధిదారుగా పేర్కొంటూ ఐటీ శాఖ తాత్కాలిక అటాచ్‌‌‌‌మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది.