South Africa vs Bangladesh: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా భారీ స్కోరు చేసింది. రైన్ రికెల్టన్ (102) సెంచరీ చేయడంతో.. 386/7 ఓవర్‌నైట్ స్కోరుతో బుధవారం నాలుగో రోజు ఆట కొనసాగించిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 124.1 ఓవర్లలో 557 రన్స్ చేసింది. కగిసో రబాడ (72)తో కలిసి రికెల్టన్ ఎనిమిదో వికెట్‌కు 117 రన్స్ జోడించాడు.
టెంబా బావుమా (68 నాటౌట్), డానీ పీటర్సన్ (29) మెరుగ్గా ఆడారు. హసన్ మహమూద్ 4, టస్కిన్ అహ్మద్, మెహిదీ హసన్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత బంగ్లాదేశ్ ఆట ముగిసే టైమ్‌కు రెండో ఇన్నింగ్స్‌లో 34.2 ఓవర్లలో 100/5 స్కోరు చేసింది. ముష్ఫికర్ రహీమ్ (5 బ్యాటింగ్), లిటన్ దాస్ (12 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం బంగ్లా ఇంకా 57 రన్స్ వెనకబడి ఉంది.
