ఏఎస్పీ, నాన్‌‌‌‌ క్యాడర్‌‌‌‌ ఎస్పీ ప్రమోషన్లకు లైన్‌‌‌‌ క్లియర్‌‌‌‌..డీఎస్పీలతో డీజీపీ మీటింగ్

ఏఎస్పీ, నాన్‌‌‌‌ క్యాడర్‌‌‌‌ ఎస్పీ ప్రమోషన్లకు లైన్‌‌‌‌ క్లియర్‌‌‌‌..డీఎస్పీలతో డీజీపీ మీటింగ్

హైదరాబాద్, వెలుగు: ఏఎస్పీ, నాన్‌‌‌‌ క్యాడర్‌‌‌‌ ఎస్పీ ర్యాంకుల్లో పెండింగ్‌‌‌‌లో ఉన్న పదోన్నతుల సమస్య పరిష్కారం దిశగా కీలక అడుగు పడింది. సీనియారిటీ వివాదాలు, రిజర్వేషన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ రోస్టర్‌‌‌‌(ఆర్‌‌‌‌ఓఆర్‌‌‌‌), ఖాళీలు, అర్హతలపై నెలకొన్న విభేదాలను పరస్పర అంగీకారంతో పరిష్కరించేందుకు డీజీపీ సీవీ ఆనంద్‌‌‌‌ చొరవ తీసుకున్నారు. అర్హులైన అధికారులు న్యాయస్థానాల్లో కేసులు, వివాదాల కారణంగా పదోన్నతులు కోల్పోకూడదనే ఉద్దేశంతో ఏకాభిప్రాయం కుదిరేలా ప్రయత్నించారు.

ఈ మేరకు మంగళవారం తన ఆఫీస్​లో డీఎస్పీల(1991, 1995, 1996 బ్యాచ్‌‌‌‌లకు చెందిన సివిల్‌‌‌‌ ఎస్సైలు)తో సమావేశమయ్యారు. వరంగల్‌‌‌‌, హైదరాబాద్‌‌‌‌ రేంజ్‌‌‌‌లతోపాటు నగరానికి చెందిన అధికారులు హాజరయ్యారు. డీఎస్పీలకు ఏఎస్పీలుగా పదోన్నతులు కల్పించేందుకు మొత్తం 54 పోస్టులు తొలిదశలో అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. సమావేశంలో కుదిరిన ఏకాభిప్రాయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు కృషి చేస్తానని డీజీపీ తెలిపారు.

ఈ మేరకు 1991, 1995, 1996 బ్యాచ్‌‌‌‌లకు సంబంధించి పదోన్నతి ప్యానళ్లను సిద్ధం చేశారు. 

గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబరు 74 ప్రకారం పదోన్నతుల ప్రక్రియ చేపట్టాల్సి ఉండగా, సీనియారిటీపై కొందరు అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వివాదం మొదలైంది. ప్రస్తుతం 12 నాన్‌‌‌‌ క్యాడర్‌‌‌‌ ఎస్పీ పోస్టుల విషయంలో ఎలాంటి న్యాయపరమైన వివాదాలు, కోర్టు కేసులు లేనందున వాటిని తక్షణమే భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. వీటితోపాటు ప్యానల్‌‌‌‌ ఇయర్‌‌‌‌లో మరో 10 నాన్‌‌‌‌ క్యాడర్‌‌‌‌ ఎస్పీ పోస్టులు కేటాయించనున్నట్లు వివరించారు. ఈ