మినిస్టర్స్ క్వార్టర్స్  ప్రాంగణంలో దొంగతనం

మినిస్టర్స్ క్వార్టర్స్  ప్రాంగణంలో దొంగతనం

హైదరాబాద్: బంజారాహిల్స్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో చోరి సంచలనంగా మారింది. మంత్రుల నివాస ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న కట్టడాల్లో నిర్మాణ సామగ్రి చోరీ జరిగింది. కన్స్ట్రక్షన్ సైట్ నుంచి డోర్స్, స్టీల్ సామగ్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు. ఆర్ అండ్ బీ అధికారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.అత్యంత పఠిష్ట భద్రత ఉండే మంత్రుల నివాస ప్రాంతంలోనే చోరి జరగడంతో పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. డోర్స్, స్టీల్ వస్తువులను దొంగలించిన వారి కోసం పోలీసులు ఇన్వెస్టిగేషన్  చేస్తున్నారు.