క్రికెట్కు రాస్ టేలర్ గుడ్ బై

క్రికెట్కు రాస్ టేలర్ గుడ్ బై

వెల్లింగ్టన్: న్యూజిలాండ్ వెటరన్ బ్యాట్స్ మన్ రాస్ టేలర్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ప్రస్తుత డొమెస్టిక్ సీజన్ తర్వాత నుంచి అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతానని ప్రకటించాడు. వచ్చే నెలలో బంగ్లాదేశ్ తో జరగనున్న రెండు టెస్టు సిరీస్ అతడికి చివరి టోర్నీ కానుంది. ఈ మ్యాచ్ ద్వారా అత్యధిక టెస్టుల రికార్డులో కివీస్ లెజెండరీ స్పిన్నర్ డానియల్ వెటోరి (112 టెస్టులు)తో టేలర్ సమానంగా నిలవనున్నాడు. ఫిబ్రవరిలో సౌతాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్ కు దూరంగా ఉండనున్న కుడి చేతి వాటం బ్యాట్స్ మన్.. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ లో మాత్రం బరిలో దిగనున్నాడు. మార్చి ఆఖరులో నెదర్లాండ్స్ తో స్వదేశంలో జరిగే సిరీస్ లోనూ టేలర్ ఆడనున్నాడు. ఆ సిరీస్ లో తన సొంతగడ్డ అయిన హామిల్టన్ ఆడే నాలుగో వన్డే.. టేలర్ కివీస్ కు ప్రాతినిధ్యం వహించే చివరి మ్యాచ్ కానుంది. 

రిటైర్మెంట్ గురించి టేలర్ సోషల్ మీడియాలో ప్రకటించాడు. బంగ్లాదేశ్, ఆసీస్, నెదర్లాండ్స్ సిరీస్ ల తర్వాత క్రికెట్ నుంచి సన్యాసం తీసుకోనున్నట్లు వెల్లడించాడు. ఈ 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ లో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ అతడు కృతజ్ఞతలు తెలిపాడు. కివీస్ కు ప్రాతినిధ్యం వహించడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. కాగా, టేలర్ టెస్టుల్లో 110 మ్యాచులు ఆడి 7,585 రన్స్ చేశాడు. వీటిలో 19 సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో 233 మ్యాచుల్లో 8,576 పరుగులు చేశాడు. ఇందులో 21 సెంచరీలు ఉన్నాయి. ఇక, టీ20ల్లో 102 మ్యాచులు ఆడిన టేలర్.. 1,909 రన్స్ చేశాడు. 

మరిన్ని వార్తల కోసం: 

నుమాయిష్కు పర్మిషన్ ఎట్లిస్తరు?

31 రాత్రి పబ్ లు, బార్లపై నజర్

రోజూ రూ.2.5 కోట్ల విలువైన నీళ్లు​ వృథా