వర్ధన్నపేట నియోజకవర్గంలోని సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

వర్ధన్నపేట నియోజకవర్గంలోని సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

హసన్​పర్తి, వెలుగు: వర్ధన్నపేట నియోజకవర్గంలోని విలీన గ్రామాల్లో 20–25 ఏండ్లుగా అపరిష్కృతంగా ఉన్న రోడ్లు, డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలిపారు. గ్రేటర్ వరంగల్‌‌‌‌‌‌‌‌లోని 1, 65, 66వ డివిజన్లలో రూ.3.75 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. 

అనంతరం ఎంఎస్‌‌‌‌‌‌‌‌ఆర్ గార్డెన్‌‌‌‌‌‌‌‌లో ఎంపీ కడియం కావ్యతో కలిసి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆయా డివిజన్ల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.