ఆస్పత్రి బాత్ రూమ్‌లో 19 ఏళ్ల బాలిక ప్రసవం.. బిడ్డను ఏం చేసిందంటే...

ఆస్పత్రి బాత్ రూమ్‌లో 19 ఏళ్ల బాలిక ప్రసవం.. బిడ్డను ఏం చేసిందంటే...

చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో హృదయవిదారకమైన ఘటన చోటు చేసుకుంది. కడుపు నొప్పి అంటూ ఆసుపత్రికి వచ్చిన ఓ యువతి ఆసుపత్రిలోని బాత్రూంలో బిడ్డకు జన్మనిచ్చి బిడ్డను బాత్రూంలో వదిలి వెళ్లిపోయిన ఘటన కలకలం రేపుతోంది. రోగుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న డాక్టర్లు సంఘటన స్థలానికి చేరుకుని బిడ్డను వెంటిలేటర్ పై ఉంచి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఎవరైనే అంశంపై దర్యాప్తు చేస్తున్నారు.  

కడుపు నొప్పి అంటూ ఆస్పత్రికి వచ్చిన 19 ఏళ్ల బాలిక బాత్ రూమ్ లో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే గుట్టుచప్పుడు కాకుండా ఆ పసిబిడ్డను బాత్ రూమ్ లోనే వదిలేసి మహిళ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది ఒక్కసారిగా అవాక్కయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రికి కడుపునొప్పి అని రావడంతో డ్యూటీలో ఉన్న డాక్టర్.. ఆమెను ఎమర్జెన్సీ వార్డ్ పక్క బిల్డింగ్‌కు వెళ్లి పరీక్ష చేయించుకొని రండని పంపించారు. డ్యూటీలో ఉన్న డాక్టర్ పరీక్షను నిర్వహించకపోవడం వల్ల పురిటి నొప్పులతో బాత్రూమ్ లోకి వెళ్లి అక్కడే ఓ బిడ్డను ప్రసవించింది. స్థానికులు బాత్రూం వెళ్ళినప్పుడు అక్కడ రక్తపు మరకలతో ఉన్న బిడ్డను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే ఆస్పత్రిలో ఉన్న ఉద్యోగులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడ ఉన్న ఉద్యోగులు ఆ బిడ్డను తీసి ఆసుపత్రిలోని వెంటిలేటర్ లో పెట్టారు. పుట్టిన బిడ్డను వదిలి వెళ్లిన తల్లిదండ్రుల మీద ప్రభుత్వ ఆసుపత్రి తరపున కేసు నమోదు చేయడం జరిగినది . పురిటి నొప్పులతో ఆస్పత్రికి వచ్చిన ఆ మహిళ ఫేక్ పేరుతో ఆస్పత్రిలో చేసినట్లు తెలుస్తుంది. అలాగే సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించి మహిళను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. కాగా ఈ హృదయవిదారక సంఘటన చూసిన అక్కడి వారు ఆశ్చర్యానికి గురయ్యారు.