వినాయక మండపాల వద్ద పేకాట

వినాయక మండపాల వద్ద పేకాట
  • మూడు కేసుల్లో 20 మంది అరెస్ట్
  • ఎస్పీ అఖిల్ మహాజన్ 

ఆదిలాబాద్ టౌన్, వెలుగు: వినాయక మండపాల వద్ద పేకాట ఆడినా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని ఆదిలాబాద్​ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. బుధవారం పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండు చోట్ల వినియక మండపాల వద్ద, స్విస్తిక్​ జిన్నింగ్​ మిల్​వద్ద పేకాట ఆడిన 20 మందిని అరెస్ట్​ చేసినట్లు చెప్పారు. రెండు రోజుల్లో వన్ టౌన్, టూ టౌన్, మావల పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కేసులు నమోదు చేశామన్నారు. వారి వద్ద నుంచి 13 సెల్ ఫోన్లు, ఒక కారు, ఐదు బైకులు, రూ.82,120 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వినాయక మండపాల కమిటీ సభ్యులపై కేసుల నమోదు చేస్తామని హెచ్చరించారు.