
పొగతాగే వారికే కాదు పొగ పిల్చుకునే వారికీ కూడా చాల ప్రమాదం అని గతంలోనే హెచ్చరించిన, ప్రస్తుత క్యాన్సర్ కేసుల్లో ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. ధూమపానం హానికరం అని ప్రభుత్వాలు ఎంత చెప్పిన, ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసిన ధూమపానం ద్వారా హాని తగ్గట్లేదు.
మన దేశంలో ఊపిరితిత్తుల(lungs) క్యాన్సర్ కేసుల్లో దాదాపు 10 నుండి 30 శాతం పొగ తాగని వారిలోనే కనిపిస్తున్నాయి. కొన్ని భారతీయ అధ్యయనాల ప్రకారం ఈ సంఖ్య 40 శాతం వరకు కూడా ఉండొచ్చని సూచిస్తుంది. అయితే పొగ తాగని వారికి క్యాన్సర్ రావడానికి కారణాలను బెంగళూరు సంప్రదా హాస్పిటల్‌లోని మెడికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ హెడ్ రాధేశ్యామ్ నాయక్ వివరించారు.
Also Read : ట్రంప్ వ్యాఖ్యలకు పీఎం మోదీ కౌంటర్
క్యాన్సర్ రావడానికి కారణాలు: పొగతాగే వారి నుంచి వచ్చే పొగని సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటారు. పొగతాగే వారి దగ్గర ఉండడం వల్ల, వచ్చే పొగ పీల్చడం క్యాన్సర్కు ఒక కారణం. అలాగే వంట కోసం కట్టెల పొయ్యి లేదా బొగ్గు కాల్చడం వల్ల వచ్చే పొగ కూడా క్యాన్సర్ బారిన పడేస్తుంది. కొన్ని పరిశ్రమలలో రసాయనాలు లేదా ఇతర కాలుష్యల వల్ల క్యాన్సర్కి గురి కావొచ్చు.
కొన్ని సందర్భాలలో ముందు నుండే ఉన్న ఊపిరితిత్తుల వ్యాధుల వల్ల కొన్ని రకాల ఊపిరితిత్తుల సమస్యలు క్యాన్సర్కి కారణం కావచ్చు. వీటితో పాటు ఈస్ట్రోజెన్‌లు అనే స్త్రీ హార్మోన్లు కూడా క్యాన్సర్‌కు కారణమయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు.