
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ ఆర్థిక వ్యవస్థపై చేసిన విమర్శలకు ప్రధాని మోదీ గట్టి సమాధానం ఇచ్చారు. ట్రంప్ వ్యాఖ్యలను ఖండిస్తూ, ప్రపంచంలో అస్థిర పరిస్థితులు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ చాలా పటిష్టంగా ఉందని స్పష్టం చేశారు. భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి సిద్ధంగా ఉందని నొక్కి చెప్పారు ప్రధాని మోదీ.
భారతదేశం ఆర్థికంగా చనిపోయిన దేశమని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను మోదీతిప్పికొట్టారు. దేశ ప్రయోజనాలను కాపాడేందుకు భారత్ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం అవసరమని ప్రధాని మోదీ అన్నారు. ఇది దేశం స్వయంసమృద్ధి సాధించడంలో సహాయపడుతుందని అభిప్రాయపడ్డారాయన.
Also Read : రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తం
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అస్థిరత పరిస్థితుల గురించి ప్రస్తావిస్తూ దేశ ప్రయోజనాలను కాపాడటానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. దేశం ఆర్థికంగా ముందుకు సాగాలని కోరుకునే అన్ని రాజకీయ పార్టీలు తమ విభేదాలను పక్కనపెట్టి స్వదేశీ ఉత్పత్తులకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.
ఈ వ్యాఖ్యల ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని ప్రపంచ వేదికపై దాని ప్రాముఖ్యత పెరుగుతోందని ప్రధాని మోదీ మరోసారి స్పష్టం చేశారు.