తెలంగాణ ప్రజల పక్షాన చెబుతున్నా.. రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తం: సీఎం రేవంత్

తెలంగాణ ప్రజల పక్షాన చెబుతున్నా.. రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తం: సీఎం రేవంత్

న్యూఢిల్లీ: తెలంగాణ ప్రజల పక్షాన చెబుతున్నా.. రాహుల్ గాంధీని భారత ప్రధానిని చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం (ఆగస్ట్ 2) ఢిల్లీలో ఏఐసీసీ ఆధ్యర్యంలో కాంగ్రెస్ వార్షిక న్యాయ సదస్సు జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసగించారు. గతంలో దేశానికి ప్రధాని అయ్యే ఛాన్స్ వచ్చిన రాహుల్ గాంధీ వదులుకున్నారని.. కానీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుంది రాహుల్ గాంధీ దేశ ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు.

75 ఏళ్లకు పదవి నుంచి దిగిపోవాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చెబుతున్నారని.. కానీ ప్రధాని సీటు వదులుకోవడానికి మోడీ ముందుకు రావడం లేదన్నారు. మోడీని ప్రధాని గద్దె మీద నుంచి కిందకు దించడం ఒక్క రాహుల్ గాంధీకే సాధ్యమన్నారు. మోడీని తరిమికొట్టి భారత రాజ్యాంగాన్ని రక్షిస్తామని పేర్కొన్నారు. 

►ALSO READ | సింగరేణికి లాభాలే కాదు.. కార్మికుల ప్రాణాలు కూడా ముఖ్యమే: మంత్రి వివేక్

‘‘కాంగ్రెస్ దేశానికి ఏం చేసిందని బీజేపీ అడుగుతోంది. దేశం నుంచి బ్రిటిష్ పాలకులను తరిమికొట్టి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే. దేశానికి రాజ్యాంగాన్ని అందించింది కాంగ్రెస్ పార్టీనే. సామాజిక న్యాయం కోసం పని చేస్తోన్న పార్టీ కాంగ్రెస్సే. బీజేపీ సహా అన్ని పార్టీలు అధికారం లేకపోతే ఇంటికే పరిమితమవుతాయి.. కానీ అధికారం ఉన్నా లేకపోయిన కాంగ్రెస్ ప్రజల పక్షాన కొట్లాడుతోంది. మాది ఎప్పటికీ ప్రజల పక్షమే. దేశం కోసం గాంధీ కుటుంబ ఎన్నో త్యాగాలు చేసింది’’  అని హాట్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్.