
గాజా స్ట్రిప్: గాజాలోని వివిధ ప్రాంతాల్లో సోమవారం ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 36 మంది పాలస్తీనియన్లు మృతిచెందారు. మువాసిలో ఒక ఇంటిపై జరిగిన దాడిలో 11 మంది, ఖాన్ యూనిస్‌లోని జపనీస్ నైబర్‌హుడ్‌లో చేసిన మరో దాడిలో 11 మంది, ఇతర పలు ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో ఐదుగురు మరణించారు.
అలాగే ఆహార, ఔషధ తదితర సాయం పంపిణీ కేంద్రం వద్ద ఇజ్రాయెల్ జరిపిన కాల్పుల్లో ఏడుగురు మరణించినట్లు అవ్దా ఆసుపత్రి ప్రకటించింది. ఈ దాడులపై ఇజ్రాయెల్ సైన్యం నుంచి ఎలాంటి ప్రకటన లేదు.