అగర్​ బత్తీతో ఆరు ఉపయోగాలు

అగర్​ బత్తీతో ఆరు ఉపయోగాలు

హిందూ సంప్రదాయంలో అగర్​ బత్తీలకు ఎంతో ప్రాధాన్యత ఉంది.  పూజ చేసే సమయంలో ధూపమాగ్రాపయామి అని మంత్రం చదివినప్పుడు అగర్​ బత్తీ వెలిగించమని చెబుతుంటారు.  ఇది మంచి సువాసన కలిగి ఉంటుంది.  సైంటిఫిక్​గా అగర్​ బత్తీని  వెలిగించడం వల్ల ఒత్తిడి , ఆందోళన తగ్గించడం... మెరుగైన నిద్రకు ఉపక్రమించడం లాంటివి అగర్​బత్తీని వెలిగించడం వలన సాధ్యపడతాయి.  అగర్​ బత్తీ వెలిగించడం వల్ల కలిగే ఆరు ప్రయోజనాల గురించి  తెలుసుకుందాం. . . .

మానసిక స్థితి:  రెండు అగర్​ బత్తీలను వెలిగించడం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది.  సాధారణంగా పూజ సమయంలో వెలిగిస్తుంటారు.  అగర్​ బత్తీని వెలిగించడం వల్ల  ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడి.. ఉదయం చాలా ఎలాంటి ఆందోళన లేకుండా ఉండేలా చేస్తుంది. 

యోగా:  వ్యాయామం చేసే ప్రదేశాల్లో  ... ముందు అగర్​ బత్తీని వెలిగించి .. ఆ తరువాత ధ్యానం చేస్తారు. ఈ ప్రదేశాల్లో ధూపం వేయడం వల్ల శక్తి ఉంటుందని భావిస్తారు.  వ్యాయామం చేసేందుకు సానుకూల వాతావరణం కల్పించడంలో అగర్​ బత్తీల ధూపం కీలక పాత్ర పోషిస్తుంది.  పెద్ద పెద్ద కార్యక్రమాలు ప్రారంభించేటప్పుడు అగర్​ బత్తీతో ధూపం వేస్తారు.  ఇది ఆ ప్రాంతంలో నెగిటివ్​ ఎనర్జీని పోగొడుతుందని చెబుతుంటారు.  

అరోమాథెరపీ:  రోజూ ఉదయం .. సాయంత్రం అగర్​ బత్తీలు వెలిగిస్తే... నూనెలు  మెదడులోని కొన్ని ప్రాంతాలను సక్రియం చేస్తాయి.  అవి  హైపోథాలమస్‌పై కూడా ప్రభావం చూపుతాయి,  సెరోటోనిన్ వంటి అనుభూతిని కలిగించే మెదడు రసాయనాలను సృష్టించడం ద్వారా చమురుకు ప్రతిస్పందనలు కలుగజేస్తాయి. 

మెరుగైన నిద్ర: నిద్రకు ఉపక్రమించే సమయంలో రెండు అగర్​ బత్తీలను వెలిగించడం ద్వారా గదిలో మంచి వాసన ఉంటుంది.  ఇది రాత్రి సమయంలో మంచి నిద్ర పట్టేందుకు దోహదపడుతుంది. దీంతో ఉదయాన్నే లేవగానే రీఫ్రెష్​గా ఉంటారు. 

ఆత్మపరిశీలన: ప్రశాంతమైన....  రిఫ్రెష్ వాతావరణంలో ఆత్మపరిశీలన చేసుకోవడంలో చాలా ఉపయోగపడుతుంది.  అగర్​ బత్తీల ధూపం   ప్రత్యేకమైన సువాసనతో శక్తిని కలిగి ఉంటుంది. , ఇది మన జీవిత ప్రయాణాన్ని లోతుగా అన్వేషించడానికి ఉపయోగపడుతుంది. 

 సృజనాత్మకత: అగర్​ బత్తీల పరిమళాలు ఇంద్రియాలను నిమగ్నం చేయడం ద్వారా సృజనాత్మకతను ప్రేరేపిస్తాయి.  ఆ ప్రాంతంలో పాజిటివ్​ ఎనర్జీ  కేంద్రీకృతమై ఉంటుంది.