ప్రియుడి ఇంటి ముందు యువతి మౌన దీక్ష

ప్రియుడి ఇంటి ముందు యువతి మౌన దీక్ష

ఆదిలాబాద్ జిల్లా: ప్రేమ పేరుతో మోసం చేశాడని ప్రియుడి ఇంటి ముందు ఓ యువతి నిరసనకు దిగింది. ఈ సంఘటన మంగళవారం ఆదిలాబాద్ జిల్లా, ఇచ్చోడలో జరిగింది. 9 సంవత్సరాలుగా రాకేష్ అనే వ్యక్తితో తనకు పరిచయం ఏర్పడిందని..అదికాస్త ప్రేమగా మారిందని తెలిపిన యువతి..పెళ్లి చేసుకుంటానని మాయమాటలు మోసం చేశాడని తెలిపింది. తనకు న్యాయం చేయాలంటూ ప్రియుడు రాకేష్ ఇంటి ముందు ఆమె మౌన దీక్ష చేపట్టింది. రాకేష్ ప్రభుత్వ ఉద్యోగి అని  తెలిపిన యువతి.. ఒక్కసారి అతడితో మాట్లాడించాలని తల్లిదండ్రులను వేడుకుంటూ మౌనదీక్ష చేపట్టింది. దీనిపై రాకేష్ ఫ్యామిలీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పిన ఆమె.. న్యాయం జరగకపోతే సూసైడ్ చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేసింది. 

మరిన్ని వార్తల కోసం..

టార్గెట్ 2027: ఎమ్మెల్యేగా గెలుపు.. ఎంపీ పదవికి రాజీనామా

నేను ముత్యాల ముగ్గు హీరోయిన్.. రేవంత్ రెడ్డి విలన్